twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, చరణ్ సినిమా కథ ఆ కాలం నాటిదే.. విలన్ గురించి ఉత్కంఠ!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న నటించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రానికి సంబందించి సందడి మొదలైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, రామ్ చరణ్ ఎలా కనిపిస్తాడు.. అసలు కథ ఏ అంశంతో రూపొందించారు లాంటి ప్రశ్నలన్నీ అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం గురించి అనేక ఊహాగానాలు వెలువడినా చిత్ర యూనిట్ మాత్రం నోరు మెదపలేదు. ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర చర్చ మొదలయింది.

    Recommended Video

    Rajamouli Son Karthikeya Starts To Kerala On RRR Movie's Work
    కథ ఆ కాలం నాటిదే

    కథ ఆ కాలం నాటిదే

    సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 1920 నాటి పరిస్థితులు ఈ చిత్రంలో కనిపిస్తాయట. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ వారి ఇమేజ్ కు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్, రాంచరణ్ కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించినట్లు తెలుస్తోంది.

    తొలి షెడ్యూల్ అక్కడే

    తొలి షెడ్యూల్ అక్కడే

    ఆర్ఆర్ఆర్ చిత్ర తొలి షెడ్యూల్ హైదరాబాద్ నగర శివారులోని గండిపేట ప్రాంతంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అద్భుతమైన సెట్ నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే విధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారట.

    నా చుట్టూ 300 మంది ఉన్నారు.. అందుకే నేలకేసి కొట్టా.. వింత ప్రవర్తనపై సూర్య తండ్రి క్లారిటీ!

    చరణ్, ఎన్టీఆర్ కలసి

    చరణ్, ఎన్టీఆర్ కలసి

    తొలి షెడ్యూల్ నుంచే రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటించే సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. కానీ చరణ్ నటిస్తున్న బోయపాటి సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో ఎలా ప్లాన్ చేసుకుంటాడనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఖాళీగానే ఉండడంతో రాజమౌళి అతడి లుక్ పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.

    విలన్ ఎవరు

    విలన్ ఎవరు

    ఇక ఈ చిత్రానికి సంబంధించి ఆడియన్స్ ని ఉత్కంఠకు గురి చేస్తున్న మరో అంశం విలన్ ఎవరు అనేది. రాజమౌళి చిత్రాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ లో నటిస్తాడని ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదని సినీవర్గాలు కొట్టిపారేశాయి. ఈ నేపథ్యంలో విలన్ ని టాలీవుడ్ నుంచి ఎంచుకుంటారా లేక బాలీవుడ్ నుంచి తీసుకుని వస్తారా అనేది వేచి చూడాలి.

    ఊహకి కూడా అందని విధంగా

    ఊహకి కూడా అందని విధంగా


    ఈ చిత్రాన్ని నిర్మాత డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. దీనిని బట్టే అర్థం అవుతోంది ఈ చిత్రం మన ఊహకి కూడా అందని విధంగా ఉండబోతోందని. ఎప్పటిలాగే ఈ చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందించనున్నారు. నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

    English summary
    Rajamouli’s RRR is a period drama. Shoot starts from November
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X