twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా చుట్టూ 300 మంది ఉన్నారు.. అందుకే నేలకేసి కొట్టా.. వింత ప్రవర్తనపై సూర్య తండ్రి క్లారిటీ!

    |

    స్టార్ హీరో సూర్య తండ్రి, ప్రముఖ నటుడు అయిన శివకుమార్ ఇటీవల ఓ ప్రారంభోత్సవంలో ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమానులు నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ఇంతకంటే పెద్ద స్టార్స్ సహనంతో వ్యవహరిస్తారు. కానీ శివకుమార్ చిన్న విషయానికే సహనం కోల్పోవడం అందరిని షాక్ కి గురిచేసింది. నెటిజన్లు శివ కుమార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ అభిమాని సెల్ ఫోన్ ని నేలకేసి కొట్టడంపై శివ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు.

    ఊహించని విధంగా

    ఊహించని విధంగా

    మధురైలో శివ కుమార్ ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. రిబ్బన్ కటింగ్ చేస్తున్న సందర్భంలో ఓ అభిమాని శివ కుమార్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఊహించని విధంగా స్పందించిన శివకుమార్ ఆ అభిమాని ఫోన్ ని నేలకేసి కొట్టాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

    సెల్ఫీలు తీసుకోవాల్సిన విధానం

    సెల్ఫీలు తీసుకోవాల్సిన విధానం

    తాను అలా ప్రవర్తించడంపై శివ కుమార్ స్పందించారు. మనం ఏదైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ మధురమైన దృశ్యాల్ని గుర్తుంచుకునేందుకు సెల్ఫీలు తీసుకుంటాం. కుటుంబం, స్నేహితులతో సంతోషాలని పంచుకునేందుకు సెల్ఫీలు తీసుకునే విధానం వచ్చింది. అలాంటి సెల్ఫీల విషయంలో నాకు అభ్యంతరం లేదు. కానీ పరిచయం లేని వ్యక్తితోనో, ఎవరైనా సెలెబ్రిటీతో సెల్ఫీ తీసుకువవడం, వారి చిత్రాలని బంధించడం చేయకూడదు.

    కనీస మర్యాద

    కనీస మర్యాద

    సెలెబ్రిటీతో ఫోటోలు దిగేముందు, సెల్ఫీలు తీసుకునే సమయంలో వారిని ఒక మాటను అడగడం కనీస మర్యాద అని శివకుమార్ అన్నారు. అలా చేయకుండా ఎవరి ఇష్టప్రకారం వారు సెలెబ్రిటీలని ఇబ్బంది పెడుతూ సెల్ఫీలు తీసుకోవడం నాకు నచ్చదు అని శివకుమార్ అన్నారు.

    300 మంది చుట్టూ ఉన్నారు

    300 మంది చుట్టూ ఉన్నారు

    నాకు ఎదురైన పరిస్థితి కూడా ప్రత్యేకమైనది. ఆ సమయంలో నా చుట్టూ దాదాపు 300 మంది ఉన్నారు. 20 మంది దగ్గరగా వచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో నా చుట్టూ ఉన్న వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. అందువలనే తాను ఓ అభిమాని ఫోన్ కిందపడేశానని శివకుమార్ తెలిపారు.

    వేలాది మందితో

    వేలాది మందితో

    సాధారణ సమయాల్లో తాను చాలా సహనంతో ఉంటానని శివ కుమార్ అన్నారు. విమానాశ్రయాల్లో, ఏదైనా ఈవెంట్స్ లో వందలాది మంది, వేలాదిమందితో అయినా తాను ఓపికగా ఫొటోగ్రాఫ్స్ దిగుతానని శివకుమార్ తెలిపారు. కానీ సెలెబ్రిటీ అయినంత మాత్రాన పబ్లిక్ ప్రాపర్టీ కాదు. వారికీ కనీస మర్యాద ఇచ్చి సెల్ఫీలు తీసుకోవాలని శివకుమార్ సూచించారు.

    English summary
    Suriya’s father actor Sivakumar explains why he smacked the phone. Sivakumar grabbed the phone from the young mans hand and smacked it on the ground which left everyone present around shocked
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X