రామ్ చరణ్ కోసం ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్.. సుకుమార్ ప్లాన్ మాములుగా లేదుగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)కాంబో రిపీట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 30న పెద్ది (Peddi) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు విరామం తీసుకోనున్న చరణ్, వెంటనే సుకుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోయే కొత్త సినిమా (RC17)పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి.

Prabhas vs Salman Khan: ప్రభాస్, సల్మాన్ ఖాన్ పోటాపోటీ.. భారీ బాక్సాఫీస్ క్లాష్ తప్పదా?ఇప్పటికే 'రంగస్థలం'వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ కాంబో మళ్లీ కలిసి పని చేయబోతుండటం ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచుతోంది. ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో సుకుమార్ కథను పూర్తిస్థాయిలో వినిపించారని, దానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈసారి సుకుమార్ పూర్తిగా భిన్నమైన కథతో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Ram Charan-Sukumar RC17 Dhurandhar Music Director Shashwat Sachdev On Board

ఆయన సినిమాల్లో కథ కంటే పాత్రలే ప్రధానంగా నిలుస్తాయి.రంగస్థలంలో చరణ్ పాత్రను ఎలా కొత్తగా చూపించారో తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా మరింత డిఫరెంట్ మేనరిజంతో, ఇప్పటివరకు చూడని షేడ్స్‌తో చరణ్ క్యారెక్టర్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. గ్రామీణ బ్యాక్‌డ్రాప్ కాకుండా ఈసారి అర్బన్ సెట్టింగ్ ఉండొచ్చని కూడా చర్చ జరుగుతోంది.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికర అంశం మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక. ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా రూమర్స్ ప్రకారం, బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న శాశ్వత్ సచ్‌దేవ్ (Shashwat Sachdev) ఈ సినిమాకి సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన ధురంధర్ 2 కు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ భారీగా ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ కూడా ఇటీవల 'ధురంధర్ 2' చూసి, షశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్‌ను ప్రత్యేకంగా ప్రశంసించడం ఈ రూమర్‌కు మరింత బలం చేకూర్చింది. దీంతో RC17కి ఆయనను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. సుకుమార్ తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. 'రంగస్థలం' తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో, ఈసారి మరింత భారీ హిట్ ఇవ్వాలనే ప్లాన్‌తో టీమ్ పని చేస్తోంది. రామ్ చరణ్ కెరీర్‌లో కూడా ఇది కీలక ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.రామ్ చరణ్ కు కెరీర్ లో మరో కొత్త మైలురాయిని చేరాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ అప్‌డేట్స్ మాత్రం అభిమానుల్లో భారీ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. శశ్వత్ సచ్‌దేవ్ నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరితే, సుకుమార్ నేరేషన్, చరణ్ పర్ఫార్మెన్స్, హై ఎనర్జీ మ్యూజిక్ అన్ని కలిపి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: sukumar rc17 ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X