‘ఇస్మార్ట్ రికార్డు’ కొట్టేసిన రామ్.. పూరీ జగన్నాథ్ చలవే అంటున్న సినీజనం

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ హీరో రామ్ కలయికలో వస్తున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటిస్తున్నారు. చాలా కాలం హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఇద్దరు నటులు ఈ సారి ఎలాగైనా ఆ కోరికను తీర్చుకోవాలని చూస్తున్నారు. అందుకోసమే పక్కా మాస్ మసాలా కథతో వస్తున్నారు.

ఇప్పటికే ఈ సిసిమాకు సంబంధించిన టీజర్.. రెండు ట్రైలర్లు.. పాటలు విడుదలయ్యాయి. వీటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఫలితంపై చిత్ర యూనిట్‌తో పాటు యావత్ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో 'ఇస్మార్ట్ శంకర్' యూనిట్‌ను ఖుషీ చేసే ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో పూరీ ఫ్యాన్స్‌తో పాటు హీరో రామ్ అభిమానులు సినిమాపై నమ్మకం పెంచేసుకున్నారు.

Ram Pothineni Beats His Career Record

ఇంతకీ ఆ న్యూస్ ఎంటనే కదా మీ సందేహం.? అదే.. 'ఇస్మార్ట్ శంకర్' ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన వార్త. విడుదలకు ముందు జరిగే వ్యాపారం రామ్ కెరీర్‌లో అత్యధికం అని తెలుస్తోంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా నైజాం రైట్స్ రూ. 7.20 కోట్లకు, ఆంధ్రా రైట్స్ రూ. 6.50 కోట్లకు, సీడెడ్ రైట్స్ రూ. 3.33 కోట్లకు, కర్నాటక రైట్స్ రూ. 1.50 కోట్లకు, అలాగే ఓవర్సీస్ రైట్స్ రూ. 65 లక్షలకు అమ్ముడు పోయాయట. మొత్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 17 కోట్లు అని చెప్పుకుంటున్నారు.

అలాగే, థియేట్రికల్ రైట్స్‌తో కలుపుకుని ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ. 36.18 కోట్లు అని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. రామ్ సినిమాకు ఈ మేర బిజినెస్ అవడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఈ ఎనర్జిటిక్ స్టార్‌కు ఈ మాత్రం బిజినెస్ రావడం వెనుక పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా కావడమేనన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X