పూరీకి షాకిచ్చిన రామ్.. అందుకే విదేశాలకు.. బయటికొచ్చిన సెన్సేషనల్ న్యూస్.!
Recommended Video
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి చేసిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్' తర్వాత హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన పూరీ.. ఈ సినిమాను పక్కా మాస్ మసాలా కథతో తెరకెక్కించాడు. ఇందులో కొన్ని టెక్నికల్ అంశాలు జోడించాడు. అలాగే, రామ్ కూడా ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని మార్చుకుని ఈ సినిమా చేశాడు. దీంతో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. సినిమా కూడా చక్కగా ఆడుతోంది. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

భారీ వసూళ్లు
‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైనప్పటి నుంచి జోరు మాత్రం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే రెండు వారాలు పూర్తయ్యే సరికి మొత్తంగా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టిందీ సినిమా. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటకలో రూ. 1.45 కోట్లను, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ. కోటి వరకు రాబట్టింది.

రెండు రాష్ట్రాలోనూ భారీ స్పందన
తెలంగాణ స్టైల్‌తో తీసినా ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లోనూ భారీ స్పందన వస్తోంది. ఇటీవల చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు ఈ విషయం అర్థమైంది. ఇదే అంశాన్ని ఇటీవల పూరీ జగన్నాథ్ కూడా ప్రస్తావించాడు. ఇక, తెలంగాణలో ఈ చిత్రానికి విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ రాష్ట్రంలో సక్సెస్ టూర్ చేస్తోంది.

రామ్ లేకుండానే..
‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైన సమయంలో హీరో రామ్ ఇక్కడ లేడు. అతడు విదేశీ పర్యటనకు వెళ్లాడు. దీంతో రామ్ లేకుండానే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్లు, టూర్లు వెళుతోంది. ఇక, రెండు రోజుల క్రితం రామ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడితో కలిసి చిత్ర యూనిట్ షాంపైన్ పొంగించిన వీడియోను ఛార్మీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

హీరో అలిగాడట
ఈ సినిమాకు రామ్ తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడన్న విషయం గతంలో బయటకు వచ్చింది. అయితే, సినిమా హిట్ అవడంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలని రామ్.. పూరీతో అన్నాడని తాజాగా ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి పూరీ అంగీకరించకపోవడంతో రామ్ విదేశీ టూర్ నుంచి రాలేదని కూడా అంటున్నారు. ఇక, పూరీ హామీ ఇవ్వడంతోనే హీరో ఎంట్రీ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్' గురించి..
పూరీ జగన్నాథ్ - రామ్ కలయికలో వచ్చిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్'లో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











