సూపర్ హిట్ ఇచ్చిన పూరీ కోసం యంగ్ హీరో సాయం.. రొమాంటిక్‌గా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు.!
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా సరైన హిట్ లేక బాధ పడుతున్న ఈ ఇద్దరినీ ఒకేసారి సక్సెస్ ట్రాక్ ఎక్కించిందీ సినిమా. 'ఇస్మార్ట్ శంకర్' ఇచ్చిన ఉత్సాహంతోనే ఈ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రామ్.. 'రెడ్' అనే సినిమాలో నటిస్తుంటే.. పూరీ మాత్రం తన కుమారుడి సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
Recommended Video

కొడుక్కి సరైన హిట్ ఇవ్వాలని
పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ కొద్ది రోజుల క్రితం హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అతడు చేసిన సినిమాలేవీ హిట్ అవలేదు. దీంతో పూరీ.. తన కుమారుడికి సరైన హిట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ‘రొమాంటిక్' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. దీనిని పూరీ శిష్యుడు అనిల్ తెరకెక్కిస్తున్నాడు.

ఒక్క పోస్టర్‌తో విమర్శలు
కొద్ది రోజుల క్రితం ‘రొమాంటిక్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో ఆకాశ్.. హీరోయిన్ కేతిక శర్మ కౌగిలించుకుని ఉన్నారు. అయితే, హీరోయిన్ ఒంటిపై దుస్తులు లేకపోవడమే అసలు సమస్య. దీంతో ఈ పోస్టర్‌పై సోషల్ మీడియాతో పాటు చాలా మంది సామాన్యులు కూడా విమర్శల వర్షం కురిపించారు. అప్పట్లో ఈ పోస్టర్ వైరల్ అయింది.

అలనాటి హీరోయిన్‌ను దింపాడు
బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. గత సినిమాలతో పోలిస్తే ఇది స్టైలిష్ పాత్రలా కనిపిస్తోంది. చీరకట్టులో హుందాగా కనిపించిన రమ్యకృష్ణ.. ఇప్పుడు షర్ట్, ప్యాంట్‌లో స్టైలిష్‌గా కనిపించబోతున్నారు.

యంగ్ హీరో గెస్ట్ రోల్
తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో రామ్ గెస్ట్ రోల్ చేస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. అవును.. రామ్ నిజంగానే ఇందులో కనిపిస్తాడట. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











