‘ఇస్మార్ట్ శంకర్’కు ఊహించని షాక్.. మహేశ్ సినిమా తర్వాత ఇదే.!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే భారీ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వాళ్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'ఇస్మార్ట్ శంకర్'. గత వారం విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని హిట్ చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. అలాగే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. అయితే, తాజా లెక్కలను బట్టి చూస్తే ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది.

'ఇస్మార్ట్ శంకర్' విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఆయా చోట్ల డిస్టిబ్యూటర్లు తమ డబ్బులను రప్పించుకున్నారని తెలుస్తోంది. అయితే, ఓవర్సీస్‌లో మాత్రం ఈ సినిమా పరిస్థితి దారుణంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. పక్కా మాస్ చిత్రం కావడంతో దీనిని చూడడానికి ఎన్నారైలు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దీంతో ఈ సినిమా థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయట. కానీ, ఓవర్సీస్ హక్కులు కొన్న వారు మాత్రం సంతృప్తిగానే ఉన్నారని చెబుతున్నారు.

Ram Pothineni iSmart Shankar DownFall In overseas

దీనికి కారణం.. 'ఇస్మార్ట్' ఓవర్సీస్ హక్కులు తక్కువ మొత్తానికి అమ్ముడపోవడమేనని అంటున్నారు. తక్కువ మొత్తానికి కొని.. తక్కువ లొకేషన్లలో విడుదల చేయడం వల్లే రెస్పాన్స్ తక్కువగా ఉందని అక్కడి వాళ్లు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన మహేశ్ చిత్రం 'మహర్షి' కూడా ఇదే తరహా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఓవర్సీస్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే.

పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన 'ఇస్మార్ట్ శంకర్'లో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X