పూరీకి షాక్.. సీక్వెల్‌కు నో చెప్పిన రామ్.. ఆ పేరు వద్దనుకోవడమే కారణం.!

దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి చేసిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమాను పక్కా మాస్ మసాలా కథతో తెరకెక్కించాడు. ఇందులో కొన్ని టెక్నికల్ అంశాలు జోడించాడు. అలాగే, రామ్ కూడా ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని మార్చుకుని ఈ సినిమా చేశాడు. దీంతో ఇద్దరూ సక్సెస్ అయ్యారు. సినిమా కూడా చక్కగా ఆడుతోంది. ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్ కూడా తీస్తామని పూరీ జగన్నాథ్ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

భారీ వసూళ్లు

భారీ వసూళ్లు

‘ఇస్మార్ట్ శంకర్' విడుదలైనప్పటి నుంచి జోరు మాత్రం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే రెండు వారాలు పూర్తయ్యే సరికి మొత్తంగా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టిందీ సినిమా. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటకలో రూ. 1.45 కోట్లను, ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ. కోటి వరకు రాబట్టింది.

‘డబుల్ ఇస్మార్ట్' టైటిల్

‘డబుల్ ఇస్మార్ట్' టైటిల్

ఇటీవల తన తదుపరి సినిమా గురించి పూరీ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది. ఎక్కడకు వెళ్లినా ‘ఇస్మార్ట్ శంకర్ 2' ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈ సినిమా సీక్వెల్ తీయాల్సిన పరిస్థితి వస్తుందని మేము ముందే ఊహించాం. అందుకే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి, సీక్వెల్‌ను ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. ఇందుకోసం ‘డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టాను'' అని ఆయన చెప్పుకొచ్చాడు.

 రామ్ మాత్రం చేయడట

రామ్ మాత్రం చేయడట

వీలైనంత త్వరగా ఈ సినిమా సీక్వెల్ చేయడానికి పూరీ జగన్నాథ్ సన్నాహాలు చేస్తుండగా.. రామ్ మాత్రం ఈ సినిమా చేయడానికి ఆసక్తిగా లేడని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం అతడిపై మాస్ హీరో అనే ముద్ర పడకూడదనేనట. వరుసగా రెండు సినిమాలు చేస్తే ఆ ప్రమాదం ఉండడంతో, కొన్ని ఫ్యామిలీ, లవ్ బేస్‌డ్ మూవీస్ చేసి ఆ తర్వాత ఈ సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడని టాక్.

కిశోర్ తిరుమలతో సినిమా

కిశోర్ తిరుమలతో సినిమా

తనకు ‘నేను శైలజ' వంటి సక్సెస్‌ను ఇచ్చిన కిశోర్ తిరుమలతో సినిమాను ప్రారంభించబోతున్నాడు రామ్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో అధికారికంగా ప్రారంభం కానుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సినిమా ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన నివేదా థామస్ నటిస్తోంది.

‘ఇస్మార్ట్ శంకర్' గురించి..

‘ఇస్మార్ట్ శంకర్' గురించి..

పూరీ జగన్నాథ్ - రామ్ కలయికలో వచ్చిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్'లో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X