Double ISMART: రామ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. డబుల్ ఇస్మార్ట్ అప్పటికి వాయిదా!
గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. అలా ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. దీంతో ఇలాంటి వాటిపై దర్శక నిర్మాతలు, హీరోలు ఫోకస్ చేసి మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు తెరకెక్కుతోన్న సినిమానే 'డబుల్ ఇస్మార్ట్'. పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీకి ఇది కొనసాగింపుగా రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
వాస్తవానికి 'ఇస్మార్ట్ శంకర్' హిట్ అయిన వెంటనే రామ్ పోతినేని హీరోగా 'డబుల్ ఇస్మార్ట్' మూవీని చేస్తామని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రకటించాడు. కానీ, ఎవరికి వాళ్లు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఉస్తాద్ రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' రాబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు, దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఆ వెంటనే ముంబైలో ఓ షెడ్యూల్‌ను కూడా కంప్లీట్ చేసి.. ఇప్పుడు కూడా చిత్రీకరణ జరుపుతోంది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగానే సాగుతోంది. ఇందులో హీరో రామ్‌తో పాటు కీలక పాత్రను చేస్తున్న పలువురు నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ చాలా టాకీ పార్టును కూడా పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్‌ను త్వరగా కంప్లీట్ చేసి మార్చి 8వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కలయికలో రూపొందుతోన్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా రిలీజ్ డేట్‌పై తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా మార్చి 8వ తేదీన విడుదల చేయడం లేదట. అంతేకాదు, దీన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఈ రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే రామ్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌గా సంజయ్ దత్ నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. మణిశర్మ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











