విజయ్ దేవరకొండకు రమ్యకృష్ణ సీరియస్ వార్నింగ్.. పూరీ వల్లే ఇదంతా.!

By Manoj Kumar P

'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆ సినిమా కథ, నటీనటులు, టైటిల్ సహా ఎన్నో విషయాలపై వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

మళ్లీ అదే ప్రయత్నం

మళ్లీ అదే ప్రయత్నం

విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే విజయ్ తన బాడీ లాగ్వేజ్ మార్చుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరిదే కీలక పాత్ర

ఆ ఇద్దరిదే కీలక పాత్ర

త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్‌లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపిన విషయం తెలిసిందే.

టైటిల్ బయటికొచ్చేసింది

టైటిల్ బయటికొచ్చేసింది

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు ‘ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని కొద్ది రోజుల క్రితమే ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్‌లో జరగనున్నాయని, ఆ తర్వాత అంటే జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎవరూ ఊహించిన పాత్రలో విజయ్

ఎవరూ ఊహించిన పాత్రలో విజయ్

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. అది పూర్తయిన వెంటనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోడానికి ‘థాయ్‌లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్‌లోనే నడుస్తుందట. అందుకే దీనికి ‘ఫైటర్' అనే పేరు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లోపు పూరీ స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తాడని టాక్.

రమ్యకృష్ణ సీరియస్ వార్నింగ్

రమ్యకృష్ణ సీరియస్ వార్నింగ్

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను చేయబోతున్నారట. ఆమె పాత్ర విజయ్ దేవరకొండకు దిశా నిర్ధేశం చేసే విధంగా ఉంటుందట. అంతేకాదు, ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే విజయ్.. తన భవిష్యత్‌పై దృష్టి సారిస్తాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ.. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్'లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X