పట్టుబట్టిన బాలయ్య, చెడిపోతుందన్న తేజ.. జయలలిత కూడా కారణమా!
దర్శకుడు తేజ్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నుంచి తప్పుకుని సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ గురించే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రానికి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. తొలి అడుగు విజయవంతంగా పడిందని భావిస్తున్న తరుణంలో తేజ ఈ చిత్రం నుంచి తప్పుకుని షాక్ ఇచ్చారు.
తేజ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో కారణాలుగా అనేక ఊహాగానాలు, లీకులు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. కథని ఎలా నడిపించాలి, ఎక్కడనుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగించాలి అనే విషయాల్లో బాలయ్య, తేజ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో కొన్ని అంశాలు తప్పనిసరిగా ఉండాలని బాలయ్య పట్టుబట్టారట. వేటగాడు చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్, జయలలితతో సూపర్ హిట్ డ్యూయెట్ సాంగ్ ఈ చిత్రంలో ఖచ్చితంగా ఉండాలని బాలయ్య తేజపై ఒత్తిడి తీసుకుని వచ్చారట. లాంటివి పెడితే కథ చెడిపోతుందని తేజ చెప్పడంతో బాలయ్య ససేమిరా అన్నారని, ఇక చేసేది లేక తేజ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. తేజ కథపై స్టడీ చేస్తున్న సమయంలో షూటింగ్ త్వరగా ప్రారంభించాలని బాలయ్య చేసిన ఒత్తిడి కూడా మరో కారణంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











