Pushpa 2: పుష్ప-2లోనూ సమంత ఐటమ్ సాంగ్ - డ్యాన్స్ మాత్రమే కాదండోయ్.. అంతకు మించి!

Samantha in Pushpa-2 Movie: పుష్ప.. పుష్ప రాజ్.. అంటూ అద్బుతమైన నటనతో అల్లు అర్జున్ తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. స్టైలిష్ స్టార్ సరసన రష్మిక మందన్నా ఈ చిత్రంలో ఆడి పాడగా... ఇద్దరూ డీగ్లామరస్ లుక్ లోనే కనిపించినా ఓ ట్రెండ్ సెట్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. అయితే పుష్ప-2 సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమై చాలా వరకు షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంది.

పుష్ప-2 లో కూడా అల్లు అర్జున్, క్రష్మికలే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 కంటే పుష్ప 2 మరింత బాగుంటుందని అంతా భావిస్తున్నారు. అదిరిపోయే పాటలతో పాటు అద్భుతమైన డైలాగ్స్ చెప్పించి థియేటర్లలో ప్రేక్షకులు రచ్చ చేసేలా చేయించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొనే పుష్ప 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట డైరెక్టర్ సుకుమార్. పార్ట - 1 లో లాగే ఈ సినిమాలోనూ ఓ ఐటెం సాంగ్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

Samantha Item Song in Pushpa 2 Also Check Details

పుష్పలో సమంత ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా పాటకు పెద్ద ఎత్తున క్రేజ్ వచ్చింది. సినిమా బ్లాక్ స్టర్ హిట్టు అవడంలో సమంత ఐటం సాంగ్ కూడా చాలా బాగా పని చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అంతకు మించిన రేంజ్ లో ఈసారి ఓ ఐటెం సాంగ్ ఉంచాలని.. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో చర్చలు కూడా జరిపారట. అయితే అవేవీ వర్కౌట్ కాలేదని.. మరోసారి కూడా స్టార్ హీరోయిన్ సమంతనే రంగంలోకి దించింతే బాగుంటుందని అనుకున్నారట.

గత కొంత కాలంగా పుష్ప 2 ఐటం సాంగ్ గురించి చర్చలు జరుగుతుండగా... తాజాగా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సమంతతోనే పుష్ప-2లో ఐటెం సాంగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. కేవలం ఆటా పాటా మాత్రమే కాకుండా.. ఆమె గెస్టు రోల్ ఉంటే కూడా బాగుంటుందని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నారట. కొన్ని సన్నివేషాల్లో సమంత కూడా కనిపిస్తే సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్ నడుస్తోంది.

Samantha Item Song in Pushpa 2 Also Check Details

పుష్ప ది రూల్ సినిమాను ఆగస్టు 15వ తేదీ 2024లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే చిత్రబృందమే నేరుగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా.. సినీల్, ధనుంజయ్, అనసూయ, విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ సినిమాలో నటిస్తే మరింత ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X