Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మల్టీస్టారర్‌గా విజయ్ - పూరీ సినిమా.. స్టైలిష్ డాన్‌గా కనిపించనున్న సీనియర్ హీరో
'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆ సినిమా కథ, నటీనటులు, టైటిల్ సహా ఎన్నో విషయాలపై వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ
విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే విజయ్ తన బాడీ లాగ్వేజ్ మార్చుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సొంత బ్యానర్‌పైనే
త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపిన విషయం తెలిసిందే.
టైటిల్ బయటికొచ్చేసింది
క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు ‘ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్‌లో జరగనున్నాయని, ఆ తర్వాత అంటే జనవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎవరూ ఊహించిన పాత్రలో విజయ్
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. అది పూర్తయిన వెంటనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోడానికి ‘థాయ్‌లాండ్' వెళ్తాడని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్ డ్రాప్లోనే నడుస్తుందట. అందుకే దీనికి ‘ఫైటర్' అనే పేరు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ లోపు పూరీ స్క్రిప్టు వర్క్ పూర్తి చేస్తాడని టాక్.
సీనియర్ హీరో ఎంట్రీ
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు తండ్రిగా ఓ సీనియర్ హీరో నటిస్తాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు, ఇందులో అతడు స్టైలిష్ డాన్‌గా కనిపించబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ పాత్రకు ఎవరిని తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. వాస్తవానికి పూరీ సినిమాలు అంటే ఎవరి క్యారెక్టర్ అయినా ఎలివేట్ అవుతుంది. కాబట్టి ఈ పాత్రకు ఎవరు నటిస్తారనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.