శ్రీరెడ్డి లీక్స్.. అందుకే అభిరామ్ పేరు బయటపెట్టిందా? ఆ దర్శకుడి ప్రయత్నాలు విఫలం..

By Rajababu

Recommended Video

Sri Reddy Leaks Suresh Babu Son Abhiram Daggubati Photo

వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యవహారం గత నెలరోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఎడతెగని సీరియల్‌లా కొనసాగుతున్నది. హాట్‌హాట్‌గా శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చేస్తుండటంతో మీడియాకు పండుగగా మారింది. పలు టెలివిజన్ ఛానెళ్లలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు, ఆవేదనను అర్థం చేసుకొన్న దర్శకుడు తేజ ఆమె పట్ల ఉదారతను చాటుకొన్నారు. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ క్రమంలోనే తేజను శ్రీరెడ్డి కలిసి తన బాధలను వివరించింది.

శ్రీరెడ్డికి తేజ అండ

శ్రీరెడ్డికి తేజ అండ

టాలీవుడ్‌లో తనకు ఎదురైన బాధలను తేజకు చెప్పుకొని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. వేషాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు తనపై లైంగిక దోపిడికి పాల్పడినట్టు ఉన్న ఆధారాలను తేజకు చూపించిందట. దాంతో శ్రీరెడ్డి పరిస్థితిని అర్ధం చేసుకొని తనకు ఆఫర్లు ఇచ్చినట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

 ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆఫర్

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆఫర్

ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీరెడ్డికి అవకాశం కల్పించాడు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరెడ్డి ఆ వేడుకలో సందడి చేసింది. ఆ తర్వాత వెంకటేష్‌తో రూపొందించే చిత్రంలో కూడా అవకాశం కల్పించింది.

తేజతో సంప్రదింపులు

తేజతో సంప్రదింపులు

తన కుమారుడు అభిరామ్‌తో ఉన్న రిలేషన్‌ను బయట పెడుతానని ‌శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్ననేపథ్యంలో అలాంటి చర్యకు పూనుకోకుండా నిర్మాత సురేష్‌బాబు జాగ్రత్తలు తీసుకొన్నాడట. తేజకు చెప్పి అభిరామ్‌ను ఈ వివాదం నుంచి తప్పించాలని ప్రయత్నించాడట.

శ్రీరెడ్డి అనూహ్య నిర్ణయం

శ్రీరెడ్డి అనూహ్య నిర్ణయం

శ్రీరెడ్డితో సురేష్‌బాబు ఇలా ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో అభిరామ్ ఫొటోలు మీడియాలో లీక్ చేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ దశలో తేజ సూచనకు తల ఊపిన శ్రీరెడ్డి ఒక్కసారిగా ఫొటోలు బయటపెట్టిందనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి.

‘మా'తో విభేదాలే

‘మా'తో విభేదాలే

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ తనకు సభ్యత్వం ఇవ్వలేదని శ్రీరెడ్డి శనివారం ఫిలిం ఛాంబర్‌లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించింది. దాంతో ‘మా' ప్రతినిధులు ఆమెపై నిప్పులు చెరిగారు. సభ్యత్వం ఇవ్వబోమని వారు ఆమెపై వేటు వేశారు. ‘మా'లో ఉన్న 900 మంది కూడా శ్రీరెడ్డితో నటించవద్దని హుకుం జారీ చేశారు.

 లీక్ వెనుక అదే కారణమట..

లీక్ వెనుక అదే కారణమట..

మా నిర్ణయంతో కంగుతున్న ఇక టాలీవుడ్‌లో తనకు భవిష్యత్ లేదనే డిసిషన్‌కు వచ్చిందట. వెంటనే పలు ఛానెళ్లతో సంప్రదింపులు జరిపి సినీ ప్రముఖుల ఫొటోలను లీక్ చేయడానికి సిద్ధపడిందట. పలు ఛానెళ్లు వెనుకంజ వేయడంతో ఓ దమ్మున్న ఛానెల్‌లో చర్చ వేదికలో కూర్చొని అభిరామ్ ఫోటోలు లీక్ చేసినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X