శ్రీరెడ్డి హైదరాబాద్‌కు దూరం కాబోతోందా.. షాకింగ్ డెసిషన్!
Recommended Video

మీడియా సంచలనం శ్రీరెడ్డి ఏం చేసినా సంచలనమే. తెలుగు, తమిళ సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు రేపాయి. మీడియాలో హాట్ హాట్ చర్చకు దారి తీశాయి. కానీ ఆ తరువాత శ్రీరెడ్డి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ మినహా మీడియాకు దూరం అయింది. ఆ తరువాత శ్రీరెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తాజగా శ్రీరెడ్డి గురించి సంచలన వార్త ప్రచారం జరుగుతోంది.

హద్దులు లేని ఆరోపణలు
వింత పోకడ, హద్దులు లేని ఆరోపణల, దూషణలతో శ్రీరెడ్డి టాలీవుడ్ లో అందరిని శత్రువులుగా మార్చుకుంది. కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు ప్రభావం చూపినా, ఆ తరువాత సహించరాని బూతు పదజాలంతో ఆమె చేసిన ఆరోపణలు విమర్శలకు తావిచ్చాయి.

హైదరాబాద్‌కు టాటా
తాజగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం శ్రీరెడ్డి హైదరాబాద్ నుంచి మకాం మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆమె తన నివాసాన్ని చెన్నైకి మార్చి అక్కడే సెటిల్ కావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెడ్డి డైరీ
శ్రీరెడ్డి బయోపిక్ ఇటీవల ప్రారంభమైంది. తన బయోపిక్ లో తానే నటించబోతోంది. రెడ్డి డైరీ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం తమిళంలో రూపొందుతోంది. ఈ చిత్రం తరువాత తమిళంలోనే తనకు అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్న శ్రీరెడ్డి అక్కడే సెటిల్ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

భద్రత లేదంటూ
పలు పర్యాయాలు తనకు హైద్రాబాద్ లో భద్రత లేదని శ్రీరెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కొత్త ఆలోచనకు ఇది కూడా ఓ కారణం కావచ్చు అనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











