SSMB 29 మహేశ్ బాబు పక్కన మరో ఇద్దరు హీరోలా? జక్కన్న ఇది ముందే చెప్పాలి కదా!
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. ఇక తన తదుపరి సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కించనున్నట్లు ముందుగానే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు కూడా నటించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. ఇది మల్టీస్టారర్ మూవీనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు.. జక్కన్నపై ఫన్నీగా ఇది ముందే చెప్పాలి కదా అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తీసింది కొన్ని సినిమాలే.. కానీ ఫ్లాప్ అనే ముచ్చట ఎరుగడు. బహుబలి సినిమాతో ఇండియాను షేక్ చేస్తే.. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కొట్టి వరల్డ్ వైడ్ గా క్రేజ్, పాపులారిటీ దక్కించుకున్నాడు. జక్కన్న.. ఏ పని చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా సాధించే వరకు వదిలిపెట్టడు. కాస్త లేటు అయినా కానీ ఆయన అనుకున్న అవుట్ పుట్ తో సినిమాలు తీస్తుంటాడు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు. ఇక మహేష్ బాబు కూడా త్వరలోనే పూర్తిగా జక్కన్న అధీనంలోకి వెళ్లనున్నారు. ఇక ఆయన త్వరగా యాడ్స్ అన్నింటిని ఫినీష్ చేసి.. త్వరలో జక్కన్న జైలులోకి వెళ్లనున్నారు. బహుబలి రేంజ్ కటౌట్ కోసం జక్కన్న.. మహేష్ కు ట్రైనింగ్ ఇప్పించనున్నారని తెలుస్తోంది.
Balakrishna ఎదురొస్తే తొక్కి పడేస్తా.. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను టార్గెట్ చేసిన బాలకృష్ణ
ఇక రాజమౌళి మహేష్ బాబు మూవీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కాస్టింగ్ వైజ్‌గా ఇందులో అంతర్జాతీయ ఆర్టిస్టులు ఉంటారని ప్రచారం సాగుతోంది. సుమారు వెయ్యి కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబు పక్కన మరో ఇద్దరు హీరోలు కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ నుంచి ఒక హీరోను.. హాలీవుడ్ నుంచి మరో హీరోను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్.. జక్కన్న ఇది మల్టీ స్టారర్ సినిమానా.. ముందే చెప్పాలికదా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి ఈ సినిమాలో ఎవరు హీరోలుగా నటిస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. యంగ్ హీరోలు నటించవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా పూర్తిగా అడ్వాంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. మరి అడ్వాంచర్స్ చేయాలంటే.. కాస్త యంగ్ గా ఉండాల్సిందే కదా.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఇండోనేషియాకి చెందిన చెల్సియా ఇస్లాన్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఆమెతోపాటు బాలీవుడ్ నటి దీపికా పదుకొనెని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. మరి ఈ భామ ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించింది. ఈ సినిమాలో నటిస్తుందో లేదో క్లారిటీ లేదు. మహేశ్ బాబు పక్కన ఇద్దరు హీరోలు గెస్టు రోల్సా లేదా.. ఫుల్ లెంగ్త్ రోల్సా అనేది తెలియాలి.
ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సాహసికుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. ఆ మేకోవర్ కోసం ఇప్పటికే మహేష్ బాబు వర్కౌట్స్ స్టార్ట్ చేయగా అందులో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి మహారాజా, మరొకటి చక్రవర్తి. మరి దేనిని ఫిక్స్ చేస్తారో చూాడలి.


Click it and Unblock the Notifications











