సుకుమార్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్.. మొదలయ్యేది ఎప్పుడంటే?
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఇప్పట్లో రెస్ట్ దొరికేలా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ సినిమాలెన్నో రూపొందుతున్నాయి. వీలైనంత వరకు ఆ సినిమాలన్ని కూడా పోటీలో కాకుండా సోలోగానే వస్తాయని తెలుస్తోంది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప పై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
అయితే సుకుమార్ ఆ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో మరో సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. సుకుమార్ తన కెరీర్ లో మొదటిసారి ఒక సినిమా సెట్స్ పై ఉండగా మరో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. విజయ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో తెలియదు గాని ఈ ఏడాది రాబోయే ఛాన్స్ లేదని క్లారిటీగా అర్ధమవుతోంది. పుష్ప ఆగస్ట్ లో విడుదక కానున్న విషయం తెలిసిందే.

ఇక విజయ్ లైగర్ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అయితే వారి సినిమా అక్టోబర్ లో మొదలవుతుంది అనుకుంటే పొరపాటే. ఇంకా సుకుమార్ కథను పూర్తి స్థాయిలో ఫినిష్ చేయలేదట. కేవలం స్టోరీ లైన్ మాత్రమే సెట్టయ్యిందట. సుకుమార్ మీద నమ్మకంతోనే విజయ్ సినిమాను ఒప్పేసుకున్నాడని తెలుస్తోంది. అంటే సుకుమార్ స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయాలి కాబట్టి సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో స్టార్ట్ చేయవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











