SSMB 29 సినిమా స్టార్ట్ అవ్వకముందే రూల్ బ్రేక్ చేసిన మహేశ్ బాబు.. మరి జక్కన్న ఊరుకుంటాడా?
రీసెంట్గా గుంటూరు కారంతో ప్రేక్షకుల్ని అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే జక్కన్న పెట్టిన ఓ రూల్‌ను బ్రేక్ చేశారని ప్రచారం సాగుతోంది. అందరూ దాని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో రూల్ బ్రేక్ చేసినప్పటికీ మహేశ్‌ను చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
గుంటూరు కారం సినిమా రిలీజ్ తర్వాత మహేశ్ బాబు ఎక్కడా కనిపించినట్లు వార్తలు రాలేదు. ఓ సారి మాత్రం జర్మనీకి వెళ్లొచ్చారు. ఆ సమయంలో ఎయిర్ పోర్టులో కనిపించారు. ఒకవేళ బయటకొచ్చినా హెయిర్‌ను క్యాప్‌తో కళ్ళని కూలింగ్ గ్లాసెస్‌తో కవర్ చేసేస్తున్నారు తప్ప తన పూర్తి లుక్‌ను రివీల్ చేయట్లేదు. ఎందుకంటే SSMB29లో ఆయన సరికొత్తగా కనిపించనున్నారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. దాని కోసమే అందుకు తగిన విధంగా మారేందుకు చాలా రోజుల నుంచి సూపర్ స్టార్ ప్రిపేర్ అవుతున్నారని అంటున్నారు.

అయితే ఇదే సమయంలో మరిన్ని వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అదేంటంటే ఇతర హీరోలకు పెట్టినంటే మహేశ్‌కు కూడా జక్కన్న కండిషన్స్ పెట్టారట. సాధారణంగా ఆయనతో ఓ హీరో సినిమా చేస్తున్నాడంటే రెండు మూడేళ్ల పాటు బల్క్ డేట్స్ కేటాయించడంతో పాటు ఆయన సినిమాను పూర్తి చేసేదాకా ఇతర ప్రాజెక్ట్స్‌కు కమిట్ అవ్వకూడదు. ఇంకా సినిమా షూటింగ్, స్టోరీ, పాత్రలకు సంబంధించి ఏ విషయాన్ని పంచుకోకూడదు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా పూర్తయ్యేదాకా హీరో ఎక్కువగా బయట కనపడకూడదు.
ఇదే కండిషన్స్‌ను మహేశ్‌కు కూడా పెట్టారట. ఇతర యాడ్స్‌లో పాల్గొనడం, తన లుక్స్‌ను రివీల్ చేయకూడదని అన్నారట. ఇది విని మహేశ్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అయిపోయారు. అంటే మరో మూడేళ్ల పాటు మహేశ్ కనపడరా అంటూ కాస్త బాధను కూడా వ్యక్తం చేశారు. దీనిపై మీమ్స్ కూడా బాగా వచ్చాయి. రీసెంట్గా ఫోన్ పేలో మహేశ్ వాయిస్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మరో మూడేళ్ల పాటు అడ్జెస్ట్ అవ్వండి అంటూ మీమ్ కంటెంట్ తెగ చక్కర్లు కొట్టాయి.
Ram Charan ఉపాసన, క్లింకారతో రామ్ చరణ్ అక్కడికి షిఫ్ట్.. అసలు ఏం జరిగిందంటే?
మరోవైపు మహేశ్ లుక్‌కు సంబంధించిన స్కెచ్‌లు కూడా కంప్లీట్ అయ్యాయని, మొత్తం ఎనిమిది లుక్స్‌ను మూవీ టీమ్ రెడీ చేసిందని అన్నారు. ఇక మహేశ్‌కు టెస్ట్ ఫొటో షూట్ చేయడమే ఆలస్యం అని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే మహేశ్ కొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో ఫుల్ గ్లామర్‌గా కనిపించి మరోసారి అందర్నీ ఫిదా చేశారు.
దీంతో మహేశ్ ఇక కనపడరని ఫిక్స్ అయిపోయిన వాళ్లంతా ఈ పిక్ చూసి తెగ ఆనందపడిపోతున్నారు. మరోవైపు జక్కన్న రూల్‌ను మహేశ్ బ్రేక్ చేశాడా అంటూ కామెంట్లు తెగ పెడుతున్నారు. ఏదిఏమైనా జక్కన్న రూల్ పెట్టాడంటే హీరోలు రూల్ బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. అది అగ్రీమెంట్ ప్రకారమే జక్కన్న ఓకే అన్నాకే ఈ కొత్త పోస్ట్ బయటకు వచ్చి ఉంటుందని మరి కొంతమంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











