»   » త్రివిక్రమ్ నూతన గృహప్రవేశం, పవన్ కళ్యాణ్ హాజరు... ఫోటోలు వైరల్?

త్రివిక్రమ్ నూతన గృహప్రవేశం, పవన్ కళ్యాణ్ హాజరు... ఫోటోలు వైరల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్ లో సొంతగా ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. చాలా సింపుల్ గా జరిగిన ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, సిరివెన్నెల సితారామశాస్త్రి కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్..... ఇంతకాలం హైదరాబాద్ లో అద్దె ఇంట్లోనే ఉన్నారని, ప్రస్తుతం ఆయన ఫైనాన్షియల్ గా సెటిలవ్వడంతో సొంతిల్లు కొనుక్కున్నట్లు సమాచారం.

ఆన్ లైన్ లో ఫోటోస్

ఆన్ లైన్ లో ఫోటోస్

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తన భార్యతో నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న దృశ్యానికి సంబంధించిన ఫోటో. ఇందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కూడా చూడొచ్చు.

పవన్ కళ్యాణ్ హాజరు

పవన్ కళ్యాణ్ హాజరు

ఈ వేడుకకు త్రివిక్రమ్ కు అత్యంత ఆప్తుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

పూర్తి వివరాలు అందాల్సి ఉంది

పూర్తి వివరాలు అందాల్సి ఉంది

అయితే త్రివిక్రమ్ హైదరాబాద్ లో ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు, ఎంత ఖర్చుతో ఈ ఇంటి నిర్మాణ చేపట్టారు లాంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...

రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...

త్రివిక్రమ్ సాధారణంగా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటారు. ఆడియో వేడుకలు, సినిమా పంక్షన్లు తప్ప ఆయన బయట ఎక్కడా కనిపించరు. ఇక ఆయన భార్య, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి కనిపించడం చాలా అరుదు.... వారికి సంబంధించిన ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Trivikram Srinivas House Warming Ceremony Photos goes viral. Trivikram Srinivas is an Indian film screenwriter, dialogue writer, and director known for his works exclusively in Telugu cinema, and screwball comedy films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu