2024లో విడిపోయే టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ జంటలు.. మెగా ఫ్యామిలీలోనే ఇద్దరు.. మిగతావారెవరంటే?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. వృత్తిరీత్యా జాతకాలు చెప్పే ఈయన.. ఎక్కువగా సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. ఎప్పుడూ కొత్త కొత్త జాతకాలు వారి జీవితంలో జరగబోయే విషయాలను చెబుతూ ట్రెండింగ్ లో నిలుస్తుంటారు. అయితే కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న అందరికీ మరోసారి షాకింగ్ విషయాలు చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన టాప్ సెలబ్రిటీలలో 2024లో విడాకులు తీసుకోబోయే వారి లిస్టును విడుదల చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss Telugu 7: చరిత్రలోనే తొలిసారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై పుస్తకం..!
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి వేణుస్వామి మరోసారి షాకింగ్ విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈయన జీవితంలో ఇంకా అనేక కాంట్రవర్సీలు ఉన్నాయని.. 2024 జులై తర్వాత అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఆయన జాతక రీత్యా మూడో పెళ్లి కూడా పెటాకులు అవుతుందని అన్నారు.

Venu Swamy Revealed Tollywood Top Celebrity Couples Who Will Break Up in 2024 List Here

అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జాతకాల్లో దోషాలు ఉన్నాయని.. వీళ్లు కలిసి ఉండడం కష్టం అని పేర్కొన్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ కు కుజదోషం, లావణ్య త్రిపాఠికి నాగదోషం ఉందని.. వీరిద్దరూ కలిసి ఉంటే అది చిదంబర రహస్యమే అవుతుందని అన్నారు. వచ్చే ఏడాది విడాకులు తీసుకునే వాళ్లలో ఈ జంట ఉండడం కన్ఫార్మ్ అంటూ వెల్లడించారు.

అలాగే యంగ్ రెబర్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి జరగడం కష్టం అని.. ఆయన ఆరోగ్య రీత్యా ఆయన పెళ్లి చేసుకోడని తెలిపారు. ఆయన పెళ్లి చేసుకున్నా నిలవడం కష్టం అని వెల్లడించారు. ముఖ్యంగా ఈయన అనుష్క శెట్టిని పెళ్లి చేసుకునే అవకాశమే లేదని.. ఒకవేళ వీరిద్దరూ ప్రేమించుకున్నామని చెబుతూ పెళ్లి చేసుకున్నా అతి త్వరలోనే విడిపోతారంటూ వేణు స్వామి వివరించారు.

ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండలు ప్రేమించుకుంటున్నారని.. వీరి జాతకంలో కూడా అనేక దోషాలు ఉన్నాయని అన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా త్వరలోనే విడిపోతారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను రష్మిక మందన్నాకు చెప్పడంతో తనతో మాట్లాడడమే మానేసిందని వెల్లడించారు. తాను చెప్పేవి 98 శాతం నిజం అవుతాయని.. అందుకే ముందుగానే కొందరికి పెళ్లి చేసుకోవద్దని చెబుతుంటానని అన్నారు. కానీ వాళ్లు వినకుండా పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం వంటివి చేస్తుంటారని వివిరంచారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X