Just In
- 49 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 3 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పూరీ కెరీర్‌లో ఇలా ఫస్ట్ టైమ్.. ఫైటర్ కోసం భారీ కసరత్తు
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి, ఆయన సినిమాలు తెరకెక్కించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవతల ఎంతటి స్టార్ హీరో ఉన్నా సరే.. పూరీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మాత్రం మారదు. సినిమాను ఎంత ఫాస్ట్‌గా అనౌన్స్ చేస్తాడో.. అంతే వేగంగా పూర్తిచేసేసి ప్రేక్షకులకు అందిస్తున్నాడు. అంతా పక్కా ప్లాన్‌తోనే బరిలోకి దిగుతాడు.

జెట్ స్పీడ్‌లో తీసే దర్శకుడు..
టాలీవుడ్‌లో తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ చిత్రాలను తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. మహేష్ బాబు లాంటి హీరోతో సైతం కేవలం 70 రోజుల్లో బిజినెస్‌మేన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇస్మార్ట్‌తో ఫుల్ జోష్..
పూరీ జగన్నాథ్ సినిమాలు ఆడటం లేదని, ఒకే ఫార్మూలాతో వస్తున్నాయని కామెంట్లు వినిపించసాగాయి. అదే సమయంలో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అటు పూరీ కెరీర్‌కు, ఇటు రామ్ కెరీర్‌కు ఇస్మార్ట్ బూస్ట్ ఇచ్చింది. ఈ మూవీ హిట్ కావడంతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేశాడు.

రౌడీతో పూరీ..
ఇస్మార్ట్ లాంటి హిట్ కొట్టిన పూరీ.. రౌడీ హీరో విజయ్ దేవరకొండను లైన్లో పెట్టాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణనింపించారు. వీటికోసం థాయ్‌లాండ్ వెళ్లి మరీ ఫైటర్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను మొదలు పెట్టిన పూరీ.. శరవేగంగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్.

ప్యాన్ ఇండియా.. కెరీర్ అలా ఫస్ట్ టైమ్
విజయ్‌తో చేయబోయే ఈ ఫైటర్ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ మూవీని తన స్టైల్లో అత్యంత వేగంగా కాకుండా.. కాస్త ఆలస్యంగా తెరకెక్కించనున్నాడని సమాచారం. ఎందుకంటే ప్యాన్ ఇండియా ఫిల్మ్ కావడం, షెడ్యూల్స్ కూడా ఎక్కువగా ఉండటంతో వంద రోజులకు పైగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఓ సినిమా కోసం ఇంత సమయాన్ని వెచ్చించడం పూరీ కెరీర్‌లోనే ఇది ఫస్ట్ టైమ్ అని టాక్.