విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ మూవీ టైటిల్ ఫిక్స్.. రిజిస్టర్ చేసిన ఛార్మి

Recommended Video

Puri Jagannath & Vijay Devarakonda's New Movie Title Has Been Fixed || Filmibeat Telugu

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో త్వరలో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ సినిమాను పూరి, చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో మంచి జోష్‌లో ఉన్న పూరి జగన్నాథ్ ఈ సినిమాను టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఈ సినిమా టైటిల్ విషయమై ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. వివరాల్లోకి పోతే..

పుష్కలంగా మాస్ ఎలిమెంట్స్

పుష్కలంగా మాస్ ఎలిమెంట్స్

గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ప్రకటించిన పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ రూపొందించే పనిలో ఉన్నారట. ఈ మేరకు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్నారట పూరి జగన్నాథ్.

టైటిల్ ఇదేనా..

టైటిల్ ఇదేనా..

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ క్రేజీ సినిమాకు 'ఫైటర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ టైటిల్ కన్ఫర్మ్ అయినట్లే అనే టాక్ వినిపిస్తోంది. ఇదే టైటిల్‌ని ఫిలిం చాంబర్‌లో ఛార్మి రిజిస్టర్ కూడా చేయించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక షూటింగ్ మొదలు పెట్టేస్తారట

ఇక షూటింగ్ మొదలు పెట్టేస్తారట

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలలో మొదలవుతుందని, 2020 సమ్మర్ లేదా అంతకంటే ముందే రిలీజ్ అయ్యలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూరి షూటింగ్ ప్లానింగ్ ఎంత పక్కాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కసారి మొదలు పెడితే అంతా పర్ఫెక్టుగా పూర్తవుతుంది. పైగా విజయ్ దేవరకొండతో షూటింగ్ అంటే ఇక ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

త్వరలోనే పూర్తి సమాచారం

త్వరలోనే పూర్తి సమాచారం

ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్స్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారట. పూరి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. పూరి, చార్మి నిర్మాతలుగా శ్రీమతి లావణ్య సమర్పణలో ఈ మూవీ తెరకెక్కనుంది.

 ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆతృత

ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆతృత

సాధారణంగానే విజయ్ దేవరకొండ స్టైల్ మాస్ ఆడియన్స్ కి స్పెషల్ కిక్కిస్తుంది. అందునా పూరి లాంటి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హాండిల్ చేయబోతున్నారనే సరికి విజయ్ అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆతృత మొదలైంది. డియర్ కామ్రేడ్ తర్వాత మాస్ మసాలా మూవీ వైపు విజయ్ మొగ్గడం స్వాగతిస్తున్నారు ఆయన అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X