విజయ్ దేవరకొండ 'లైగర్' వచ్చేది ఎప్పుడంటే.. పూరి జగన్నాథ్ జెట్ స్పీడ్ షూటింగ్
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మొదటి మూవీ లైగర్. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన ఏడాది తరువాత అసలు షూటింగ్ పనులు మొదలయ్యాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇక మొదలు పెడితే ఆగకూడదు అనేలా షూటింగ్ ను పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ పై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

మొదటిసారి పూరి ప్రయోగం..
దర్శకుడు పూరి జగన్నాథ్ తన 20ఏళ్ల సినిమా కెరీర్ లో దాదాపు అగ్ర హిరోలందరితో వర్క్ చేశాడు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. గత వారం లైగర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

బడ్జెట్ నెంబర్లు పెరిగాయి..
అయితే సినిమా బడ్జెట్ విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. విజయ్ కూడా ఇంతవరకు బడ్జెట్ విషయంలో లిమిట్స్ అయితే దాటలేదు. మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను రెడీ చేస్తున్నారు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకోవడం వల్ల బడ్జెట్ నెంబర్లు కూడా పేరిగినట్లు టాక్

రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే
సాధారణంగా పూరి జగన్నాథ్ ఒక సినిమా షూటింగ్ ను ఎంత వేగంగా పూర్తి చేస్తాడో అందరికి తెలిసిందే. ఇక లాక్ డౌన్ వల్ల లైగర్ లేటయ్యింది గాని లేకుంటే ఈపాటికె థియేటర్స్ లోకి వచ్చి ఉండేది. ఇక ఇప్పుడు సెట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను సమ్మట్ ఏండింగ్ జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. అప్పటికే పెద్ద సినిమాలన్నీ కూడా ముందే రిలీజ్ అవుతాయి కాబట్టి పెద్దగా పోటీ కూడా ఉండదు.

హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ..
ఇక సినిమాని హిందీలో కరణ్ జోహార్ భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి అనుకున్న సమయానికి పూరి సినిమాను రెడీ చేస్తాడో లేదో చూడాలి. ఇక లైగర్ సినిమా కోసం మొత్తం రూ.110కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. కేవలం ఇది ఒక అంచనా మాత్రమేనని తెలుస్తోంది. అవసరం అయితే మరికొంత పెరిగే ఛాన్స్ ఉందట. కేవలం పూరి కెరీర్ లోనే కాకుండా విజయ్ కెరీర్ లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ.


Click it and Unblock the Notifications











