‘లైగర్’ క్లైమాక్స్‌పై సెన్సేషనల్ న్యూస్: ఈ ఎపిసోడ్‌లో ఒక్కటి కాదు.. ఎన్నో సర్‌ప్రైజ్‌లు
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాతో రౌడీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రాబోతుందన్న విషయం తెలిసిందే. ఇందుకోసం విజయ్ చాలా కాలం పాటు అందులో శిక్షణ కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ను కూడా చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. ఈ నేపథ్యంలో 'లైగర్' మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకు వచ్చింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా క్లైమాక్స్ గతంలో వచ్చిన వాటి మాదిరిగా మొత్తం బాక్సింగ్ నేపథ్యంతోనే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను ఎంతో కొత్తగా డిజైన్ చేశాడట పూరీ జగన్నాథ్. 20 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్‌లో హాలీవుడ్‌కు చెందిన రియల్ ఫైటర్‌తో విజయ్ పోరాటం చేస్తాడట. అదే సమయంలో ఓ భారీ ట్విస్ట్‌ను కూడా చూపించబోతున్నాడట. అన్నింటికీ మించి ఇందులో ఓ ఎమోషనల్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ క్లైమాక్స్‌లో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోన్న 'లైగర్' మూవీని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. ఇక, ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు.


Click it and Unblock the Notifications











