Liger మూవీకి కళ్లు చెదిరే బడ్జెట్: అన్ని కోట్లతో రిస్క్ చేసిన నిర్మాతలు.. కారణం ఇదేనట
బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. హీరోగా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. ఊహించని రీతిలో పాపులారిటీని అందుకున్నాడు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. అంతేకాదు, తనదైన వ్యవహార శైలితో నేషనల్ లెవెల్‌లో గుర్తింపును కూడా దక్కించుకున్నాడు. ఇక, ఇప్పుడు 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీని చేస్తోన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

సక్సెస్ కోసం చూస్తున్న విజయ్
ఆరంభంలో చిన్న పాత్రలు చేసి.. ‘పెళ్లి చూపులు'తో విజయ్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీని తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి'తో స్టార్ స్టేటస్ వచ్చింది. అనంతరం ‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' వంటి హిట్లను అందుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపులను చవి చూస్తూ విజయం కోసం ఆతృతగా చూస్తున్నాడు.

డైనమిక్ డైరెక్టర్‌తో భారీ సినిమా
వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

హాలీవుడ్ రేంజ్‌లో రాబోతుంది
బాక్సింగ్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ‘లైగర్'లో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులు పని చేస్తున్నారు. అలాగే, హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఇందులో భాగం అయ్యారు. అలాగే, అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైన విషయం తెలిసిందే.

అంచనాలను పెంచిన వీడియో
విజయ్ దేవరకొండ - పూరీ కాంబోలో వస్తున్న ‘లైగర్' మూవీ ఫస్ట్ గ్లిమ్స్ వీడియో ఇటీవలే విడుదలైంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్, లైకులు సొంతం అయ్యాయి.

లైగర్ మూవీకి కళ్లుచెదిరే బడ్జెట్
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘లైగర్' మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి దీన్ని పూరీ జగన్నాథ్, ఛార్మీ ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత వీళ్లకు కరణ్ జోహార్ జత కలిశాడు. దీంతో ఈ మూవీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా భారీ స్థాయిలో పెరిగిందని తెలిసింది.
Recommended Video

కోట్లతో రిస్క్ చేసిన నిర్మాతలు
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ‘లైగర్' మూవీకి రూ. 93 కోట్లు బడ్జెట్ అవుతుందట. మొదటి లిమిటెడ్ వ్యయంతో దీన్ని తెరకెక్కించాలని అనుకున్నా.. విజయ్ దేవరకొండకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడడంతో దీన్ని రేంజ్ పెంచారట. దీంతో మొత్తంగా దీనికి ఇంత బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. ప్రమోషన్స్‌తో కలుపుకుంటే వంద కోట్లు దాటే అవకాశం ఉందని టాక్.


Click it and Unblock the Notifications











