Liger Release Date: మహేష్ బాబుకు పోటీగా రాబోతున్న విజయ్ దేవరకొండ.. డేట్ ఫిక్స్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కరోనా దెబ్బకు పెద్ద సినిమాలన్నీ కూడా ఫెస్టివల్స్ హడావుడిలో చేరాయి. మళ్ళీ కరోనా కారణంగా ఎక్కడ దెబ్బ పడుతుందో అనే భయంతో ఫెస్టివల్స్ లోనే సినిమాలను వదులుతున్నారు. ఆ సమయంలోనే జనాలు థియేటర్స్ లోకి వస్తారని దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే మళ్ళీ రెండు బడా సినిమాలు సమ్మర్ లో పోటీకి దిగబోతున్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో పాటు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కూడా ఒకే తేదీన రాబోతుండడం చర్చనీయాంశంగా మారింది.

హై వోల్టేజ్ లాంటి బాక్సర్..

హై వోల్టేజ్ లాంటి బాక్సర్..

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఇప్పుడు తెరపైకి వస్తుందా అని రౌడీ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయ్ దేవరకొండ హై వోల్టేజ్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

పూరి కెరీర్ లోనే..

పూరి కెరీర్ లోనే..

పూరి జగన్నాథ్ తన కెరీర్ లో మొదటి సారి చాలా ఎక్కువ సమయం కేటాయించిన మొదటి ప్రాజెక్టు లైగర్ అని చెప్పవచ్చు. సాధారణంగా ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని చూస్తాడు. ఏ సినిమాకు కూడా ఏడాదికి పైగా సమయాన్ని తీసుకోలేదు. కానీ లైగర్ కోసం మాత్రం చాలా సమయం వేచి చూడాల్సి వచ్చింది. కరోనా కారణంగా కూడా కాస్త ఆలస్యం అయ్యింది.

లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్

లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్


లైగర్ సినిమాను ఇదే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడడంతో సమ్మర్ లో కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం లైగర్ సినిమా ఫోకస్ మొత్తం ఏప్రిల్ 1వ తేదీ పై పడినట్లు తెలుస్తోంది. మొదట మార్చి లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సమ్మర్ హాలిడేస్ లో సినిమాలు విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుతాయని ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఏప్రిల్ ఫస్ట్ బెస్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఈ డేట్ పై త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
సర్కారు వారి పాటతో క్లాష్

సర్కారు వారి పాటతో క్లాష్

అయితే అదే రోజున సర్కారు వారి పాట సినిమా కూడా విడుదల కాబోతోంది. మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అయితే సినిమా మొదట సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండడంతో ఏప్రిల్ ఒకటో తేదీన రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక అదే సమయంలో విజయ్ దేవరకొండ సినిమా కూడా వస్తుండడంతో ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమాల్లో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X