విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్.. రౌడీ స్టార్ పుట్టినరోజున లైగర్ పంజా!
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా కష్టపడి పైకొచ్చిన స్టార్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. వెండితెరపై స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ మరోసారి తన స్థాయిని మరింత పెంచుకునే సమయం దగ్గరపడుతోంది. మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అనేలా సినిమాలు చేస్తున్నాడు. మొదటిసారి నెవర్ బిఫోర్ అనేలా లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక సర్ ప్రైజ్ రానున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్

టైటిల్ తోనే భారీ క్రేజ్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ 'లైగర్' అనే టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అనేక రకాల రూమర్స్ వెలువడుతున్నాయి. నిజంగా సినిమా ఎలా ఉంటుందో అనే ఆలోచనలు కూడా అంచనాల డోస్ ను పెంచుతున్నాయి. సింహానికి, పులికి పుట్టిన క్రాస్ బ్రీడ్ వంటి ఎనిమల్ పేరు పెట్టడంతో టైటిల్ బాగా వైరల్ అయ్యింది.
స్టైలిష్ లుక్ తో కవ్విస్తున్న లేటెస్ట్ మహేశ్వరి

రికార్డు స్థాయిలో..
విజయ్ దేవరకొండ తెలుగు సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయిన విషయం తెలిసిందే. యూ ట్యూబ్ లో ఆ సినిమాలు రికార్డు స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్ సినిమా కూడా 110మిలియన్స్ కు పైగా వ్యూవ్స్ అందుకోవడం విశేషం. ఇక లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమా వస్తే బజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కళ్ళతోనే మత్తు మందు జల్లుతున్న మేఘాలి

ఇంటర్నేషనల్ బాక్సర్ పాత్రలో..
ఇక ఇప్పటివరకు లైగర్ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ మాత్రమే విడుదలైంది. విజయ్ ఈ సినిమాలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నేషనల్ లెవెల్ బాక్సర్ గా ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇంటర్నేషనల్ హై వోల్టేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని టాక్ వస్తోంది. ఇక విజయ్ పుట్టినరోజు సందర్భంగా పూరి ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి

పుట్టినరోజు లైగర్ పంజా
మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో తప్పకుండా లైగర్ కు సంబంధించిన ఒక అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక లైగర్ పంజా తరహాలో ఉండేలా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయవచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. అది కుదరకపోయినా మోషన్ పోస్టర్ అయినా వస్తుందట. ఎదో ఒక విధంగా ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని లైగర్ టీమ్ ప్లాన్ చేసిందట. మరి ఆ సర్ ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











