పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ?

By Bojja Kumar

'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకుని, 'అర్జున్ రెడ్డి' మూవీతో యూత్‌లో క్రేజ్ సంపాదించి....'గీత గోవిందం' సినిమాతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.... రూ. 100 కోట్లు వసూళ్లు సాధించిన హీరోల లిస్టులో చేరిపోయాడు. స్టార్ హీరో రేంజికి వెళ్లిపోయాడు.

ఇండస్ట్రీలో దర్శకులకు, నిర్మాతలకు విజయ్ దేవరకొండ ఇపుడు హాట్ కేక్. ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది టాప్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా విజయ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda in Puri Direction?

విజయ్ కోసం పూరి ఇప్పటికే ఓ స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాడని, త్వరలోనే విజయ్‌ని కలిసి కథ వినిపించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. తాను రాసుకున్న కథలో హీరో క్యారెక్టర్‍‌కు విజయ్, అతడి యాటిట్యూడ్ వందశాతం సూటవుతుందనే ఉద్దేశ్యంతో పూరి ఉన్నాడట.

Recommended Video

Vijay Devarakonda's Nota movie Release Date Confirmed

వరుస పరాజయాలతో ఉన్న పూరితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎవరూ ముందుకు రావడం లేదు. మరి విజయ్ దేవరకొండ ఈ పూరికి ఓకే చెబుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ ఓకే అంటే పూరి తప్పకుండా హిట్ కొడతాడంటున్నారు ఫ్యాన్స్.

కాగా... ప్రస్తుతం పూరి తన కుమారుడు ఆకాష్ నటిస్తున్న సెకండ్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు తానే కథ అంధించి, నిర్మిస్తున్న ఆయన.... దర్శకత్వం బాధ్యతలు మాత్రం కొత్త దర్శకుడికి అప్పగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X