స్టార్ హీరో సినిమాలో విజయ్ దేవరకొండ స్పెషల్ రోల్.. మళ్ళీ ఏడేళ్ళ తరువాత
టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలతో అభిమానులకు సరికొత్త కిక్కిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ కాంబినేషన్స్ సెట్స్ పైకి వస్తుండడంతో టాలీవుడ్ మార్కెట్ స్థాయి పెరుగుతోంది. ఒక విధంగా ఈ కలయిక హీరోల అభిమానుల్లో పాజిటివ్ వాతావరణాన్ని పెంచుతోంది. ఇక త్వరలో విజయ్ దేవరకొండ మరొక స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

హీరోగా అతని స్థాయి ఎంత పెరిగినా
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో వరకు వచ్చిన విజయ్ ఏ స్థాయిలో కష్టపడ్డాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే హీరోగా అతని స్థాయి ఎంత పెరిగినా కూడా చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడం మాత్రం మరువడం లేదు. రౌడీ స్టార్ కేవలం హీరోగానే కాకుండా అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ తో మెప్పిస్తున్న విషయం తెలిసిందే.

చిన్న సినిమాల్లో..
వరుసగా బాక్సాఫీస్ హిట్స్ కొట్టిన తరువాత కూడా ఈ నగరానికి ఏమైంది? సినిమాలో స్టార్ హోదా ఏ మాత్రం చూపించకుండా నార్మల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అనంతరం తన సొంత ప్రొడక్షన్ లో కొత్త టెక్నీషియన్స్ కు అవకాశం ఇచ్చి మీకు మాత్రమే చెప్తా సినిమా చేసిన విజయ్ అందులో కూడా అతిధి పాత్రలో కనిపించాడు.

మరోసారి నానితో
ఇక జాతిరత్నాలు సినిమాలో అయితే ఒక బ్లూ షర్ట్ అబ్బాయిగా సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా వరుసగా అతిధి పాత్రలు చేసుకుంటూ వెలుతున్న విజయ్ మరోసారి నానితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 2015లో వచ్చిన నాని ఎవడే ససుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

శ్యామ్ సింగరాయ్.. గెస్ట్ రోల్
ఇక మళ్ళీ ఏడేళ్ళ అనంతరం నాని బిగ్ బడ్జెట్ సినిమాలో విజయ్ కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు. పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్. ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఒక గెస్ట్ రోల్ లో మెప్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











