స్టైలిష్ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ భారీ సినిమా: బడా ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్

కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేశాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన అతడు.. అందులో పక్కింటి అబ్బాయిలా కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ వెంటనే వచ్చిన 'అర్జున్ రెడ్డి'లో మాత్రం వైలెంట్‌గా దర్శనమిచ్చి యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి జయాపజయాలతో కెరీర్‌ను ముందుకు నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న 'లైగర్'లో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాడట. అది కూడా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో అని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ మాఫియా బ్యాగ్ డ్రాప్‌తో సాగుతుందని, ఇందులో విజయ్ దేవరకొండ డాన్‌లా కనిపిస్తాడని అంటున్నారు. గతంలో ఇదే స్టోరీని మహేశ్ బాబుకు చెప్పాడని, ఇందులోనే కొన్ని మార్పులు చేసి రౌడీ స్టార్‌కు వినిపించాడనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఓ స్టైలిష్ కాంబో సెట్ అయినట్లు అనిపిస్తోంది.

Vijay devarakonda to Pairup to Vamsi Paidipally

మహేశ్ బాబు రిజెక్ట్ చేసిన తర్వాత ఇదే కథను పలువురు హీరోలకు వినిపించాడు వంశీ పైడిపల్లి. దీంతో చాలా మంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండతో మూవీ సెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తాడని అంటున్నారు. ఇదిలా ఉండగా.. పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న 'లైగర్' సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X