విజయ్ దేవరకొండ ఉగ్రరూపం: అంత క్రేజీగా ఎప్పుడూ చూసుండరేమో.. అనుమానాలు మొదలు!
'అర్జున్ రెడ్డి' అనే సినిమాతో ఒక్కసారిగా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించిన ఈ కుర్రాడు.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. ఇంతకీ ఏంటా ప్రయోగం.? ఆ వివరాలు మీకోసం.!
Recommended Video

వరుస ఎదురుదెబ్బలతో విజయ్ ఢీలా
కెరీర్ ఆరంభంలో పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అయితే, ఈ మధ్య అతడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం విజయ్‌కు పరాజయాలు ఎదురు కావడమే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అతడి చిత్రాలు ‘డియర్ కామ్రేడ్', ‘వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం తెలిసిందే.

క్రేజీ హీరో.. డైనమిక్ డైరెక్టర్‌తో కలిశాడు
వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతోన్న విజయ్ దేవరకొండ ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. దీనికి ‘ఫైటర్', ‘లైగర్' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

ఆయన ఎంట్రీతో మొత్తం మారిపోయింది
ఈ సినిమాను తెలుగులోనే రూపొందించాలని భావించింది చిత్ర యూనిట్. ఇందుకోసం నిర్మాతలు పూరీ జగన్నాథ్, ఛార్మీ కూడా ప్లాన్లు చేసుకున్నారు. అయితే, ఈ మూవీ స్క్రిప్ట్ గురించి తెలుసుకున్న బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. దీన్ని పాన్ ఇండియా మూవీగా తీయాలని చిత్ర యూనిట్‌కు చెప్పారు. అంతేకాదు, ఆయన కూడా నిర్మాణ భాగస్వామి అయ్యారు.

ముంబైలో హల్‌చల్ చేసిన రౌడీ స్టార్
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఐదు భాషల్లో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ మూవీతో విజయ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసమే ఈ సినిమా షూటింగ్‌ను ముంబై పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండ వారి అబ్బాయి ఆ నగరంలో తెగ హల్‌చల్ చేశాడు.

విజయ్ - పూరీ సినిమాపై అనుమానాలు
కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పూర్తయినా విజయ్ దేవరకొండ - పూరీ సినిమా షూటింగ్ ప్రారంభం కాదని ప్రచారం జరిగింది. దీనికి కారణం ఆ మూవీ షూటింగ్ ముంబైలో జరగడమే అన్నారు. కానీ, అందులో నిజం లేదని తెలిసింది.

విజయ్ దేవరకొండ ఉగ్రరూపం.. అనుమానాలు
తాజాగా విజయ్ దేవరకొండ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ కోసం అతడు కెరీర్‌లో తొలిసారి కోరమీసంతో కనిపించబోతున్నాడట. అలాగే, మరో లుక్‌లోనూ దర్శనమివ్వబోతున్నాడని అంటున్నారు. ఈ కోరమీసం న్యూస్ తెలిసిన తర్వాత ‘ఫైటర్' మూవీ కథకు ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ముడిపెట్టారా అని అందరిలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











