విజయ్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్: ఆ ఫొటో బయటకు వచ్చాకే అనుమానాలు మొదలు.!

By Manoj

కెరీర్ ఆరంభంలోనే 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే అతడు తక్కువ సమయంలో అత్యంత భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీంతో అతడు మార్కెట్ కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా మంది ఫిల్మ్ మేకర్లు విజయ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో దేవరకొండ కూడా కొత్త కొత్త పాత్రలు చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతడు పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...

నలుగురితో కలిసి ప్రేమికుల రోజున వస్తున్నాడు

నలుగురితో కలిసి ప్రేమికుల రోజున వస్తున్నాడు

విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్‌, కేథరిన్‌, ఇజబెల్లె లైట్ హీరోయిన్లు. కేఎస్ రామారావు సమర్పిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మిస్తోంది. నలుగురిని ప్రేమించే యువకుడిగా విజయ్ ఇందులో కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రేమికుల రోజున విడుదల కానుంది.

ఇది పూర్తవకుండానే అది మొదలైంది

ఇది పూర్తవకుండానే అది మొదలైంది

‘వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా షూటింగ్ పూర్తవకుండానే విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం అయింది. దీనిని చార్మీతో కలిసి పూరీ స్వయంగా నిర్మించనున్నాడు. వీరితో పాటు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నారు.

ఒక్కటి కాదు.. ప్రతీది హాట్ టాపిక్కే

ఒక్కటి కాదు.. ప్రతీది హాట్ టాపిక్కే


ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో పలానా హీరోయిన్ నటిస్తుందని.. పలానా ఆర్టిస్టు కీలక పాత్ర చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే, దీనికి ‘ఫైటర్' అనే టైటిల్ పెట్టబోతున్నారని కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లు నటిస్తున్నారన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.

అది దృష్టిలో ఉంచుకుని రిస్క్ చేస్తున్నారు

అది దృష్టిలో ఉంచుకుని రిస్క్ చేస్తున్నారు


పూరీ జగన్నాథ్ టేకింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే క్రేజీ హీరో విజయ్‌తో చేయబోయే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నిర్మాతలు పూరీ, ఛార్మీ రిస్క్ తీసుకోడానికి కారణం విజయ్‌కు ఉన్న మార్కెటే అనే టాక్ వినిపిస్తోంది.

విజయ్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్

విజయ్ సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్

తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీకి అందరూ అనుకుంటున్న ‘ఫైటర్' అనే టైటిల్ ఫిక్స్ చేయలేదట. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీని టైటిల్ మార్చాలని కరణ్ జోహార్.. పూరీ జగన్నాథ్‌కు చెప్పాడని ఫిలిం నగర్ ఏరియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఆ ఫొటో బయటకు వచ్చాకే అనుమానాలు

ఆ ఫొటో బయటకు వచ్చాకే అనుమానాలు

రెండు రోజుల క్రితం ఈ సినిమా అధికారికంగా ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో క్లాప్ బోర్డు మీద సినిమా పేరు లేదు. దీంతో సినిమా టైటిల్ మారిందన్న వార్తలకు బలం చేకూరింది. అప్పటి నుంచే దీనిపై వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X