విజయ్‌కు జోడీగా ఫ్యాన్.. ఎవరూ ఊహించని అమ్మాయిని తీసుకొస్తున్న పూరీ.. సెట్ చేసింది ఎవరంటే..

Recommended Video

Vijay Devarakonda Will Romance With Bollywood Beauty Jhanvi Kapoor || Filmibeat Telugu

'ఇస్మార్ట్ శంకర్' హిట్‌తో ఊపుమీదున్న పూరీ జగన్నాథ్ - 'డియర్ కామ్రేడ్' ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే.. ఈ సినిమా నటించే హీరోయిన్ గురించి. ఇంతకీ ఆమె ఎవరు.? పూర్తి వివరాల్లోకి వెళితే..

పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

పూరీ, విజయ్.. మాస్ మసాలా కథ

విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమా కోసం పూరీ జగన్నాథ్ పక్కా మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. తన గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత ఇకపై మాస్ సినిమాలే చేస్తానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మరో మాస్ స్టోరీని సిద్ధం చేసేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే విజయ్ తన బాడీ లాగ్వేజ్ మార్చుకోబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సొంత బ్యానర్‌పైనే

సొంత బ్యానర్‌పైనే

త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాను పూరీ తన సొంత బ్యానర్‌లో చేయనున్నాడు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పూరి, ఛార్మి నిర్మాతలు. ప్రొడక్షన్ బాధ్యతలు ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది. ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్ర యూనిట్‌ తెలిపిన విషయం తెలిసిందే.

ఎవరూ ఊహించని హీరోయిన్

ఎవరూ ఊహించని హీరోయిన్

పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ సినిమాలో ఎవరూ ఊహించని ఓ హీరోయిన్‌ను నటింపజేస్తున్నారని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది.

విజయ్ నా ఫేవరెట్

విజయ్ నా ఫేవరెట్

కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానం చెప్పేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాన్వీ ఈ సినిమాలో తన అభిమాన హీరోతో నటించబోతుందన్న మాట. ఇంతకీ ఈమెను సెట్ చేసింది మరెవరో కాదు.. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ అనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాలు

ప్రస్తుతం ఆమె చేస్తున్న చిత్రాలు

ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే, ‘దోస్తానా 2' సినిమాలోనూ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X