విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ.. మూవీ ప్రారంభం ఎప్పుడు? నిర్మాతలు ఎవరంటే..

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్నారనే అంశంపై కొద్దికాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు వరుస విజయాలను చేజిక్కించుకొంటున్న ఈ హీరో సినిమాలు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్రం అంతగా విజయవంతం కాలేకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. అయితే తన బాలీవుడ్ ప్రవేశంపై జాతీయ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ముంబైలో విజయ్ దేవరకొండ

ముంబైలో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకు ముందు విజయ్ దేవరకొండ రెగ్యులర్‌గా ముంబైలో పర్యటించారు. అయితే మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ కూడా ఉండటంతో డియర్ కామ్రేడ్ రీమేక్‌ గురించి అనే విషయం వార్తల్లో నానింది. అయితే దాంతో పాటు విజయ్ దేవరకొండ పలు మార్లు ముంబైకి వెళ్లి ప్రముఖులతో చర్చలు జరిపినట్టు తెలిసింది.

సెప్టెంబర్ 6 తేదీన

సెప్టెంబర్ 6 తేదీన

బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ నటించే సినిమా సెప్టెంబర్ 6న ప్రారంభం కాబోతున్నదట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, కరణ్ జోహర్, సాజిద్ నడియావాలా సంయుక్తంగా నిర్మించడానికి సిద్ధమయ్యారనేది బాలీవుడ్ పత్రిక కథనంలో పేర్కొన్నది. ఈ చిత్రంలో ఓ క్రేజీ హీరోయిన్ నటించబోతున్నదని, త్వరలోనే నటీనటులు వివరాలు ప్రకటిస్తారని తెలిసింది.

దక్షిణాది భాషల్లో

దక్షిణాది భాషల్లో

ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే.. భారీగా ఆశలు పెట్టుకొన్న డియర్ కామ్రేడ్ చిత్రం అంతగా సంతృప్తిని ఇవ్వలేకపోయింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లో రిలీజైన చిత్రంలో కథనం వేగం లేదనే విషయం విమర్శలను ఎదుర్కొన్నది. కాకపోతే విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందనే విషయం డియర్ కామ్రేడ్ సినిమాకు ముందు స్పష్టమైంది. నాలుగు భాషల్లోనూ విశేష స్పందన కనిపించింది.

వరుస సినిమాలతో

వరుస సినిమాలతో

డియర్ క్రామేడ్ తర్వాత వరుసగా మూడు సినిమాలకు ఒకే చెప్పారు. ఒకటి క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కేఎస్ రామారావు నిర్మాణ సారథ్యంలో క్రాంతి మాధవ్ రూపొందించే సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. అంతేకాకుండా హీరో అనే ద్విభాషా చిత్రంలోనూ, అలాగే ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినిమాను కూడా లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X