Jana Gana Mana Story: ముందే లీకైన జన గణ మన మూవీ స్టోరీ.. ఊహించని పాత్రలో విజయ్

వినూత్నమైన చిత్రాలతో, హీరోలకు ప్రత్యేకమైన మేనరిజాన్ని చూపిస్తూ తనకంటూ విశేషమైన గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. తన చిత్రాల ద్వారా కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ డైరెక్టర్.. కొంత కాలం పాటు వరుస పరాజయాలను చవి చూశాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇస్మార్ట్ శంకర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్న పూరీ.. ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో లైగర్ అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత అదే హీరోతో తన డ్రీమ్ ప్రాజెక్టు 'జన గణ మన' అనే సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ బయటకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

లైగర్‌తో పాన్ ఇండియా బాట

లైగర్‌తో పాన్ ఇండియా బాట

సుదీర్ఘమైన ప్రయాణంలో టాలీవుడ్‌లో హవాను చూపించిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. పూరీ, చార్మీలతో కలిసి కరణ్ జోహార్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.

లైగర్ కంప్లీట్.. జన గణ మనే

లైగర్ కంప్లీట్.. జన గణ మనే

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘లైగర్' మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ‘లైగర్ షూటింగ్ ఈరోజే పూర్తైంది. ఇక జన గణ మనే' అంటూ పూరీ చెప్పిన డైలాగ్‌ను హీరోయిన్ ఛార్మీ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

మహేశ్ కోసం ‘జన గణ మన'

మహేశ్ కోసం ‘జన గణ మన'

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పూరీ జగన్నాథ్ గతంలో ‘పోకిరి', ‘బిజినెస్‌మ్యాన్' వంటి సూపర్ డూపర్ హిట్లు తెరకెక్కించాడ. వీటి తర్వాత వీళ్ల కాంబోలో ‘జన గణ మన' అనే సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇద్దరి మధ్యా దూరం పెరగడంతో అది కాస్తా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత పవన్ దీన్ని చేస్తాడని అనుకున్నా ఎందుకనో కార్యరూపం దాల్చలేదు.

విజయ్ దేవరకొండతో మూవీ

విజయ్ దేవరకొండతో మూవీ

పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే ‘జన గణ మన' గురించి తరచూ ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే దీని గురించి ఊహించని న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాను పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించబోతున్నాడట. అంతేకాదు, లైగర్ పూర్తైన వెంటనే దీన్ని మొదలెడతారనే టాక్ కూడా వినిపించింది.

శ్రీదేవి కూతురిని ఒప్పించేసి

శ్రీదేవి కూతురిని ఒప్పించేసి

ఇక, ఇప్పటికే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ మధ్య ‘జన గణ మన' ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కూడా ముగిసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లు కూడా ఓ వార్త లీకైంది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని టాక్.

జన గణ మన స్టోరీ లైన్ లీక్

జన గణ మన స్టోరీ లైన్ లీక్

పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రానున్న ‘జన గణ మన' మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకూ రాలేదు. కానీ, ఈ సినిమా గురించి మాత్రం ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా స్టోరీ లైన్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీ లంచాలతో నిండిపోయిన ఓ ఊరిని బాగు చేసే నేపథ్యంతో రూపొందబోతుందని తెలిసింది.

Recommended Video

Pushpaka Vimanam Movie Success Meet | Anand Devarakonda Lovely Speech
ఊహించని పాత్రలో విజయ్

ఊహించని పాత్రలో విజయ్

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నాడట. బోర్డర్ నుంచి ఊరికి వచ్చి.. అక్కడ అవినీతి గురించి తెలుసుకున్న అతడు.. అందరినీ ఎలా మార్చాడు అన్న లైన్‌తో ఇది రూపొందుతోందని అంటున్నారు. ఇక, ఈ మూవీలో విజయ్ పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X