పూరితో చేస్తూనే మరో సినిమాకు రెడీ అయిన విజయ్ దేవరకొండ! డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. జయాపజయాలతో సంబందం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవలే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రూపంలో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీమతి లావణ్య సమర్పణలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించనున్నాడు. బాక్సింగ్ సన్నివేశాల్లో రియాలిటీ ఉట్టిపడేందుకు గాను ఆయన శిక్షణ కూడా తీసుకున్నాడు. ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు మేకర్స్. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం కరోనా కారణంగా తదుపరి షెడ్యూల్స్ షూటింగ్ వాయిదా వేసుకుంది.

Vijay Deverakonda preparing for director Vivek Athreya project

ఇకపోతే హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తూనే.. తన తదుపరి చిత్రానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. 'బ్రోచేవారెవరురా' ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు విజయ్. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచేలా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X