విజయ్ దేవరకొండను కష్టపెడుతున్న పూరి జగన్నాథ్.. అందుకోసమే ప్రత్యేకంగా!
ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఫైటర్ (వర్కింగ్ టైటిల్). విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు పూరి. ఛార్మీ, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.
టైటిల్‌లో చెప్పినట్టుగానే చిత్రంలో విజయ్ దేవరకొండ ఫైటర్‌గా కనిపించనున్నారు. ఆయనతో ఇరగదీసే ఫైట్స్ ప్లాన్ చేశారట డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఇందుకోసం విజయ్ దేవరకొండకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారట. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సహా ఇతర పోరాట కళల్లో శిక్షణ ఇవ్వడం కోసం 15 మంది ట్రైనర్స్‌ను నియమించారని తెలుస్తోంది. వీరి సమక్షంలో ప్రస్తుతం శిక్షణ జరుగుతోందట.

ఆ ట్రైనర్స్ దగ్గర కఠిన శిక్షణ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఈ మేరకు కఠిన ఆహార నియమాల్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. బాడీ ఫిట్, ఫైటింగ్‌లో మెళకువలు నేర్చుకునేందుకు విజయ్ బాగా కష్టపడుతున్నారట. జనవరి నెలాఖరులో ముంబైలో 'ఫైటర్' చిత్రీకరణ స్టార్ కానుంది. శ్రీమతి లావణ్య సమర్పణలో రాబోతున్న ఈ సినిమా హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు అతిత్వరలో ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











