విజయ్ దేవరకొండతో ఆలియా భట్ రొమాన్స్.. పూరి ప్లాన్!

బాలీవుడ్ భామ ఆలియా భట్ తెలుగు తెరపై రాణించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తన తొలి సినిమా RRR షూటింగ్ పూర్తిచేసుకున్న ఆమె.. మరో సినిమాను సైన్ చేసే ఆలోచనలో ఉందట. అది కూడా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు అడుగులు వేస్తోందట.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తికాగానే ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'ఫైటర్' అనే పేరు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్‌లో తీయాలనే ఆలోచనతో కరణ్ జోహార్‌ను నిర్మాణ భాగస్వామిగా తీసుకున్నాడు.

Vijay Deverakonda Romance With Alia Bhatt?

అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండ సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చిన పూరి.. బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బెటర్ అని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఆ విషయాన్ని కరణ్ జొహార్‌కి చెప్పి ఆ భాధ్యతను అతనికే అప్పగించాడట పూరి. కాగా జాన్వీ కపూర్, సారా అలీఖాన్, ఆలియా భట్ పేర్లు పరిశీలించిన కరణ్.. ఆలియా భట్ వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. అలాగే ఆలియా డేట్స్ కూడా అందుబాటులో వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి టాలీవుడ్‌లో ఆలియా రెండో సినిమా ఇదే అవుతుందేమో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X