షాకింగ్: ‘ఫైటర్’ ఆ సినిమాకు సీక్వెల్.. అప్పుడు ఆ హీరోతో హిట్ కొట్టాడు.. మరి ఇప్పుడు.?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న బడా దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. ఈయన ఇటీవలే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాతో బంపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరో దానిని లైన్‌లో పెట్టేశారు. ఇందులో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇది వరకే వెలువడింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ ప్రాజెక్టు అనుకున్నప్పటి నుంచే ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. దీంతో అందరి అంచనాలను చేరుకునేందుకు పూరీ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.?

మళ్లీ అదే తరహా.. కానీ కొంచెం కొత్తగా
పూరీ జగన్నాథ్ అంటే ఎలాంటి సినిమాలు తీస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ మాస్ ఆడియెన్స్‌కు నచ్చే విధంగా ఉన్నాయి. అందుకే పూరీ ఆ జోనర్‌ను వదిలిపెట్టరు. ఇటీవల హిట్ కొట్టిన ‘ఇస్మార్ట్ శంకర్' కూడా పక్కా మాస్ మూవీనే. ఇప్పుడు విజయ్‌తో చేసే సినిమా కూడా అదే తరహాగా ఉంటుందని తెలుస్తోంది.

ఆ నమ్మకంతోనే ఇద్దరూ కలుస్తున్నారు
ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్‌లోనే నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. వాస్తవానికి ఈ సినిమా కూడా ఎవరి నిర్మాణంలోనైనా చేయొచ్చు. కానీ, ఈ సినిమా కోసం రాసే కథపై పూరీకి బాగా నమ్మకం ఉందట. అందుకే ఆయన స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయన కలవడంతో ఇంకా గ్రాండ్‌గా
క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఫైటర్'ను ఐదు భాషల్లో తెరకెక్కిస్తారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సినిమాపై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అవుతోంది.

విజయ్‌ను ఇప్పటి వరకు ఇలా చూడలేదు
భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘ఫైటర్' అనే టైటిల్ పెట్టారని ఇప్పటికే దాదాపుగా కన్ఫార్మ్ అయిపోయింది. ఇందులో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్ తెలిసిన యువకుడిగా కనిపిస్తాడని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఆ టైటిల్ పెట్టబోతున్నారని అంటున్నారు. అంతేకాదు, ఇందులో విజయ్ సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తాడని టాక్.

‘ఫైటర్' ఆ సినిమాకు సీక్వెల్
తాజాగా ఈ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' అనే సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతుందనేదే ఆ న్యూస్ సారాంశం. 2003లో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, అసిన్ జంటగా నటించారు. ‘ఇడియట్' వంటి హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











