Jana Gana Mana Movie: మహేశ్, పవన్‌ను పక్కన పెట్టేసిన పూరీ.. ఆ స్టార్ హీరోతోనే జన గణ మన మూవీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ క్రమంలోనే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసి హవాను చూపించాడు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను అందుకున్న ఈ సంచలన దర్శకుడు.. కొన్నేళ్ల పాటు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ ట్రాక్ ఎక్కి.. ఇప్పుడు విజయ్‌ దేవరకొండతో లైగర్ అనే మూవీ చేస్తున్నాడు. ఇక, పూరీ గతంలో 'జన గణ మన' అనే స్క్రిప్టును రెడీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమై వార్త బయటకొచ్చింది. ఆ వివరాలు మీకోసం!

పూరీ జగన్నాథ్ అదిరే కమ్‌బ్యాక్

పూరీ జగన్నాథ్ అదిరే కమ్‌బ్యాక్

ఆ మధ్య ‘టెంపర్'తో మాంచి సక్సెస్‌ను అందుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఆ తర్వాత మళ్లీ వరుసగా పలు పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఈ డైరెక్టర్‌ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్' అనే సినిమా చేశాడు. పక్కా మాస్ మసాలా కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

విజయ్‌తో పాన్ ఇండియా మూవీ

విజయ్‌తో పాన్ ఇండియా మూవీ

ఇటీవలి కాలంలో యమ జోష్ మీదున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్' అనే సినిమాను చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. పూరీ, చార్మీలతో కలిసి కరణ్ జోహార్ దీన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.

మహేశ్‌తో జన గణ మన సినిమా

మహేశ్‌తో జన గణ మన సినిమా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు పూరీ జగన్నాథ్ గతంలో ‘పోకిరి', ‘బిజినెస్‌మ్యాన్' వంటి సూపర్ డూపర్ హిట్లను అందించాడు. వీటి తర్వాత వీళ్ల కాంబోలో ‘జన గణ మన' అనే సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇద్దరి మధ్యా దూరం పెరగడంతో అది కాస్తా పట్టాలెక్కలేదు. దీంతో ఈ ప్రాజెక్టును పూరీ జగన్నాథ్ పక్కన పెట్టేశాడని అనుకున్నారు.

పవన్ కల్యాణ్‌తో చేయాలని ప్లాన్

పవన్ కల్యాణ్‌తో చేయాలని ప్లాన్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరో సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని అంటున్నారు. అంతేకాదు, దీన్ని మహేశ్ బాబు కోసం రెడీ చేసిన ‘జన గణ మన' స్క్రిప్టుతోనే చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

వాళ్లిద్దరినీ పక్కన పెట్టిన పూరీ

వాళ్లిద్దరినీ పక్కన పెట్టిన పూరీ

తన కెరీర్‌లోనే డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే ‘జన గణ మన'పై పూరీ జగన్నాథ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎలాగైనా దీన్ని త్వరలోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందుకోసం ఓ బడా ప్రొడ్యూసర్‌ను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. అయితే, ఈ ప్రాజెక్టు కోసం మహేశ్ బాబును కానీ, పవన్ కల్యాణ్‌ను కానీ ఇకపై సంప్రదించకూడదని పూరీ జగన్నాథ్ డిసైడ్ అయ్యాడట.

ఆ స్టార్ హీరోతోనే సినిమాకు సై

ఆ స్టార్ హీరోతోనే సినిమాకు సై

పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టైన ‘జన గణ మన' గురించి తరచూ ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీని గురించి ఊహించని న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో తీయబోతున్నాడట. సుకుమార్‌తో అతడి సినిమా అయిన వెంటనే దీన్ని మొదలెడతారనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Liger - Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger
విజయ్‌కు జోడీగా జాన్వీ కపూర్

విజయ్‌కు జోడీగా జాన్వీ కపూర్


ఇప్పటికే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ మధ్య ‘జన గణ మన' ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకున్నట్లు కూడా ఓ వార్త తెలిసింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించబోతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X