బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం

By Manoj

ఒకరు తెలుగులో ఇండస్ట్రీ హిట్లు అందించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. మరొకరు తక్కువ సినిమాలే చేసినా ఎక్కువ క్రేజ్ దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ. వీళ్లు కలిసి సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే విజయ్‌ను ఈ సినిమాలో చూపించాలని పూరీ భావిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..

తన మార్క్ అస్సలు తగ్గకుండా

తన మార్క్ అస్సలు తగ్గకుండా

పూరీ జగన్నాథ్ అంటే మాస్ డైరెక్టర్. ప్రేక్షకుల నాడిని తెలుసుకున్న ఈ డైరెక్టర్ ఇటీవల రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్' సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడదే ఉత్సాహంతో విజయ్ దేవరకొండ సినిమాను కూడా మాస్ మసాలా కథతోనే తెరకెక్కించబోతున్నాడట. తన మార్క్ ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందించాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడీ డైరెక్టర్.

 ఆ ఉత్సాహంతో పెడుతున్నారు

ఆ ఉత్సాహంతో పెడుతున్నారు

ఈ సినిమా ప్రకటించినప్పుడే నిర్మాతల వివరాలు కూడా వెల్లడించారు. దీన్ని కూడా పూరీ తన బ్యానర్స్ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌లోనే చేస్తున్నాడు. ఆయనతో పాటు ఛార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనుంది. ‘ఇస్మార్ట్ శంకర్' సినిమా భారీ సక్సెస్ అవడంతో పాటు దాదాపు రూ. 70 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ ఉత్సాహంతోనే దీన్ని కూడా నిర్మిస్తున్నారని టాక్.

అందుకే ఫైటర్ అనే టైటిల్

అందుకే ఫైటర్ అనే టైటిల్

ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమా కోసం ఫిలిం చాంబర్‌లో ‘ఫైటర్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్ తెలిసిన యువకుడిగా కనిపిస్తాడట. అందుకే దీనికి ఆ టైటిల్ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంట్లో విజయ్ సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తాడని అంటున్నారు.

బాలీవుడ్‌లోకి విజయ్ ఎంట్రీ

బాలీవుడ్‌లోకి విజయ్ ఎంట్రీ

ఈ మధ్య తరచూ ముంబైలో పర్యటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అక్కడ బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్లతో కలిసి పార్టీలు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ‘ఫైటర్' సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు ఇప్పటికే కరణ్ జోహార్‌తో చర్చలు కూడా ముగిశాయని అంటున్నారు.

 ఐదు భాషల్లో వస్తున్నాడు

ఐదు భాషల్లో వస్తున్నాడు

పూరీ జగన్నాథ్‌కు హిందీ చిత్రాన్ని తెరకెక్కించిన అనుభవం ఉంది. అలాగే, ‘ఫైటర్' స్క్రిప్ట్ కూడా అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఉండడంతో కరణ్ ఈ సినిమాను హిందీలోనూ తెరకెక్కించమని కోరాడని సమాచారం. దీనికి ఆయన సహా నిర్మాతగా వ్యవహరిస్తారట. అలాగే, తమిళం, కన్నడం, మలయాళంలో కూడా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X