పూరి లాటరీ టికెట్ లాంటోడు, అందుకే వల్గర్ లాంగ్వేజ్: రామ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్ 'ఇస్మార్ట్ శంకర్'. ఇటీవల విడుదలైన ట్రైలర్లో ... పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి చూపించిందట... నీ జాతిల నా పుల్ల అంటూ రామ్ చెప్పే డైలాగులు కాస్త వల్గర్‌గా ఉన్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అయ్యాయి.
జులై 18న ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో హీరో హీరోయిన్లు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొందరు జర్నలిస్టులు వల్గర్ డైలాగుల గురించి ప్రశ్నించారు. అలాంటి డైలాగులు పెట్టడానికి గల కారణంపై రామ్ వివరణ ఇచ్చారు.

మీడియా వల్లే మేము కలిశాం
‘ఇస్మార్ట్ శంకర్' ప్రాజెక్ట్ మీడియానే క్రియేట్ చేసింది. మేము ఏమీ అనుకోకుండానే రామ్-పూరి సినిమా రాబోతోంది అంటూ రాశారు. ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది. ఆ తర్వాతే మేము కలిశాం. ఒక రకంగా మీకు కూడా థాంక్స్ చెప్పాలి. జగడం లాంటి సినిమా చేయాలని చాలా మంది అన్నారు. అలాంటి స్రిప్టులు ఏమీ రాలేదు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అలాంటి మాస్ స్క్రిప్ట్ పూరిగారి ద్వారా వచ్చిందని రామ్ చెప్పుకొచ్చారు.

వల్గర్ లాంగ్వేజ్ వెనక కారణం అదే
సినిమాలోని వల్గర్ లాంగ్వేజ్ మీద రామ్ స్పందిస్తూ..... క్యారెక్టర్ బట్టే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ పాత్ర ఎందుకకు అలా ఉంటుంది? అనేదానికి ఒక రీజన్ ఉంటుంది. హీరోయిన్ కూడా ఓ సీన్లో ఇదే విషయం అడుగుతుంది. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావ్ అంటే దానికి వాలిడ్ పాయింట్ కూడా హీరో చెబుతాడు. ఓల్డ్ సిటీ ఏరియాలో ఉంటాడు కాబట్టి అతడు మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటుందని తెలిపారు.

అతడు చేసే పనులను సపోర్ట్ చేయను
డైరెక్టర్ సినిమాలో రాసిన క్యారెక్టర్ కానీ, ఒక హీరో ఒక సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్ కానీ నేను వంద శాతం సపోర్ట్ చేయను. సినిమాలో శంకర్ చేనే ప్రతి పని కరెక్ట్ అనను. అదొక ఫిక్షనల్ క్యారెక్టర్ అంతే. పేరెంట్స్ ఉండరు, అలా పెరిగాడు కాబట్టి ఆ లాంగ్వేజ్ అలా ఉంటుంది. ఆ పాత్రను కేవలం తెరపై చూసి ఎంజాయ్ చేయాలి... అని రామ్ సూచించారు.

పూరి ఒక లాటరీ టికెట్
పూరి జగన్నాథ్‌కు టెంపర్ తర్వాత ఒక్క సక్సెస్ కూడా లేదు. అలాంటి డైరెక్టర్‌కు మీరు అవకాశం ఎలా ఇచ్చారు. ఆయన మిమ్మల్ని ఎలా క్యాచ్ చేశాడు అనే ప్రశ్నకు రామ్ స్పందిస్తూ... పూరి జగన్నాథ్ అనే ఆయన ఒక లాటరీ టికెట్. కొడితే ఓ రేంజిలో కొడతాడు. అవకాశం ఇవ్వడం లాంటివి ఏమీ లేదు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కానీ, సన్నిహితులు మీ ఇద్దరికీ బాగా సెట్టవుద్ది కదా... ఎందుకు చేయడం లేదు అనేవారు. ఫైనల్‌గా మాకు అలా కుదిరింది. ఎవరూ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు.

నా జీవితంలో ఎవరూ లేరు, సింగిల్‌గానే ఉన్నా
వరుసగా సినిమాలు ఇద్దరు హీరోయిన్లతో చేయడం అనేది అనుకోకుండా అలా జరిగిపోతోంది. అలాంటి కథలే వస్తున్నాయి. అయితే నా రియల్ లైఫ్ లో మాత్రం నేను సింగిలే. నా జీవితంలో ఇంకా ఏ అమ్మాయి లేదు అని రామ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











