మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసిన పూరి జగన్నాథ్ కొడుకు.. రంగంలోకి రెబల్ స్టార్!

టాలీవుడ్ మాస్ కమర్షియల్ దర్శకుడు పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కూడా రొమాంటిక్ సినిమాతో హీరోగా మొదటి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. పూరి జగన్నాథ్ దగ్గర ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న యువ దర్శకుడు అనిల్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ సినిమాలో హాట్ మోడల్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ఆకాష్ ఇదివరకే మెహబూబా సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. ఇక ఈసారి రొమాంటిక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమాపై వర్గం ప్రేక్షకుల్లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్ కూడా సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. సినిమా ప్రమోషన్స్ తో మరింత హైఓ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగానే ప్రణాళికలు రచిస్తోంది. అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ కరోనా కారణంగా మళ్లీ ఎప్పటిలానే వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్ గా సినిమా పనులన్నీ పూర్తి కావడంతో ఈనెల 29న విడుదల చేయబోతున్నారు. మొదట నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు ప్రచారాలు కొనసాగించారు అయితే మళ్ళీ ఒక వారం ముందే విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ చేశారు.

 Akash puri romantic movie trailer Prabhas launched by prabhas date fix,

అక్టోబర్ 29వ తేదీన విడుదల కాబోతున్న రొమాంటిక్ సినిమా ప్రమోషన్ విషయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవల కాస్త ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా రంగంలోకి దీంచబోతున్నారు. సినిమాకు సంబంధించిన రొమాంటిక్ ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు పూరిజగన్నాథ్ వివరణ ఇచ్చాడు. మంగళవారం సాయంత్రం 4గంటలకు డార్లింగ్ సోషల్ మీడియా ద్వారా రొమాంటిక్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలని ఆకాష్ చాలా కాన్ఫిడెన్స్ తో నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఆకాష్ పూరి ప్రస్తుతం మరొక రెండు సినిమాలతో కూడా చాలా బిజీగా ఉన్నాడు. జార్జి రెడ్డి మేకర్స్ తో కూడా కొన్ని నెలల క్రితం ఒక సినిమాను స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ హీరో గా సెట్టవ్వాలని చూస్తున్న ఆకాష్ తండ్రి సపోర్ట్ లేకుండానే అవకశాలు బాగానే అందుకుంటున్నాడు. ఇక మరోవైపు దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో మొదటి సారి ఒక పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. లైగర్ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే తుది దశలో ఉంది ఇప్పటికే 85 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X