Nagarjuna నాగార్జున విగ్గు రహస్యం బట్టబయలు చేసిన మేకప్ మ్యాన్.. వీడియో వైరల్
సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడమంటే దాదాపు చాలా మందికి ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారు ఏం తింటారు? ఎలాంటి బట్టలు ధరిస్తారు? వాటి ధర ఎంత? వాళ్ళు వాడే లగ్జరీ కార్లు ఏంటి? ఎంత ధర ఉంటాయి? ఇలా అనేక విషయాల మీద అభిమానలు, సాధరణ ప్రజలు ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలా ఈ మధ్య చాలా మందికి హీరోల జుట్టు ఒరిజినలా? కాదా? అని తెలుసుకునే విషయంలోనూ ఆసక్తి చూపడం మొదలు పెట్టారు. అలా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హెయిర్ గురించి ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో నాగార్జున మేకప్ మ్యాన్ విగ్గు రహస్యాన్ని బట్టబయలు చేశారు. దాని గురించే ఈ కథనం..
RC17 పాన్ ఇండియా దర్శకుడితో రామ్ చరణ్ సినిమా... ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఔట్!
సోషల్ మీడియాలో ఇప్పటికే స్టార్ హీరోలు విగ్గు వాడుతూ ఉంటారంటూ ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ప్లంటేషన్ చేసుకున్నారని అని కూడా వార్తలు వస్తుంటాయి. ఇక బాలయ్య బాబుది విగ్గు అని ఆయనే స్వయంగా చెప్పుకువచ్చారు కూడా. ఇక ఆ విషయం పక్కన పెడితే.. నాగార్జున హెయిర్ గురించి ఇప్పుడు నెట్టింట్లో ఓ వీడియో వైరల్ గా మారింది. ఆయన వద్ద పని చేసిన ఓ మేకప్ మ్యాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

విగ్ వీడియో వైరల్...
హీరో నాగార్జున ఆరు పదుల వయసులోనూ ఎంత ఫిట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన డైట్ గురించి కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకువచ్చారు. మరి ఆయన జుట్టు ఒరిజినాలా లేదా విగ్గా అంటే.. ఆ విషయాన్ని ఆయన వద్ద పని చేసే మేకప్ మ్యాన్ బట్టబయలు చేశాడు. నాగార్జున వద్ద ఎన్నో ఏళ్లుగా మేకప్ మ్యాన్ గా చంద్ర పని చేస్తున్నాడు. ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఫ్యామిలీ మొత్తం...
అందులో చంద్ర మాట్లాడుతూ.. నాగార్జున వద్ద ఏన్నో ఏళ్లుగా పని చేశాను. అల్లరి ప్రియుడు నుంచి మొన్నటి మనం సినిమా వరకు నేనే మేకప్ మ్యాన్ గా పని చేశాను. నాగార్జున ఫ్యామిలీ మొత్తం ఇంట్లో మనిషిగా చూసేవారు. పనివాడు మాకేంటి అనే ఉద్దేశం వారి వద్ద ఉండేది కాదు.. ఇంట్లో వ్యక్తిగా చూసేవాళ్లు. చైతన్య, అఖిల్ తో కూడా నేను పనిచేశాను. వీరితోనే కాదు.. రామ్, కల్యాణ్ బాబు వంటి హీరోలతో కూడా వర్క్ చేశాను.

నాగార్జునది ఒరజినల్ జుట్టు...
నాగార్జున జుట్టు ఒరిజినలా అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగ్గా.. మేకప్ మ్యాన్ మాట్లాడుతూ... అయ్యే ఆయన విగ్గు వాడరు. ఇప్పటికీ ఒరిజినల్ జుట్టు.. కాకపోతే.. అవసరం అయితే కొన్ని సార్లు హెయిర్ ఎక్స్ టెండ్ చేసేవాళ్లం తప్ప.. ఆయనది విగ్ మాత్రం కాదు అంటూ చెప్పుకువచ్చారు. దీంతో నాగార్జునది ఒరజినల్ జుట్టు అని తేలిపోయింది. ఈ న్యూస్ తెలుసుకున్న నాగార్జున ఫ్యాన్స్... ఈ వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు.
చాలా సినిమాలకు పని చేశా...
ఇక చంద్ర.. నాగార్జునతో కలిసి శివ, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, షిర్డి సాయిబాబ, మనం, రగడ, శ్రీరామదాసు వంటి చిత్రాలకు మేకప్ మ్యాన్ గా పని చేశానని చెప్పుకువచ్చారు. ఆయనతో శివ నుంచి షిర్డి సాయిబాబ దాకా అన్ని సినిమాలకు పనిచేశాను. నేను ఏం అడిగినా చేసేవ్యక్తిత్వం ఆయనది అంటూ చెప్పుకువచ్చారు. ఇక నాగార్జున ప్రస్తుతం ధనుష్ తో కలిసి కుభేర అనే చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











