Akash Puri పొలిటికల్ లీడర్ మనవరాలితో ప్రేమ.. ఇంతకాలానికి ఓపెన్ అయిన ఆకాశ్ పూరి!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, లవ్ ఎఫైర్స్ అనేవి సహజం అయిపోయాయి. ఇక హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ హీరోయిన్, హీరోయిన్ ప్రొడ్యూసర్.. ఇలా ఎవరు ఎవరితో ప్రేమలో పడిపోతారో తెలియదు. అయితే అప్పట్లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా ప్రేమలో పడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అంతేనా త్వరలోనే పెళ్లంటూ ప్రచారం సైతం జరిగింది. అయితే తాజాగా ఆకాష్ పూరి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇంత కాలానికి తన రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యి అందరికీ క్లారిటీగా చెప్పుకువచ్చాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం.
ఇండస్ట్రీలో పూరీ జగన్నాద్ కు సపరేట్ స్థానం ఉంటుందనే చెప్పాలి. ఆయన సినిమాలకు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. ఏ సినిమా తీసిన అందులో తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పేస్తారు. ఇక ఆయన సినిమాల్లోని డైలాగ్స్ అయితే వేరే లెవెల్. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు. ఇక బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన కొడుకు ఆకాశ్ పూరి.. పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే సరైనా హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు ఈ కుర్రహీరో.

అయితే ఆ మధ్య ఈ కుర్ర హీరో ఓ పొలిటికల్ లీడర్ అమ్మాయితో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. ఆకాష్ పూరి త్వరలోనే రాజకీయ నాయకుడు మనవరాలితో పెళ్లికి రెడీ అయ్యారంటూ వార్తలు గుప్పుమన్నాయి. చిన్న వయసులోనే పెళ్లికి రెడి అయిపోయాడా అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక పూరి జగన్నాథ్ మాత్రం పెళ్లొద్దు అంటూ వీడియోలు చేస్తుంటే.. ఆయన కొడుకు మాత్రం పెళ్లికి రెడీ అయిపోయాడా అంటూ కామెంట్స్ వినిపించాయి.
ఇదిలా ఉంటే వాటికి ఆకాష్ పూరి చెక్ పెట్టేశాడు. తన రిలేషన్ షిప్ గురించి అందరి ముందు చెప్పి షాకిచ్చాడు. అసలు విషయం ఏంటంటే.. ఆకాష్ పూరి RC ట్రెండ్ సెట్టర్స్ అనే ఓ క్లాతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా దానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో RC ట్రెండ్ సెట్టర్స్ యజమానులతో పాటుగా ఆకాష్ పూరి పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకువచ్చారు. ఇక తన రిలేషన్ షిప్ గురించి కూడా వెల్లడించాడు.

గత కొంతకాలంగా పొలిటికల్ లీడర్ మనవరాలిని ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆకాష్ పూరి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని వెల్లడించారు. ఏ అమ్మాయినీ ప్రేమించడం లేదని చెప్పుకువచ్చాడు. దీంతో తన రిలేషన్స్ గురించి వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయింది. ఇక ఆకాష్ పూరి తన సినిమాల గురించి మాట్లాడుతూ.. నా గత సినిమా చోర్ బజార్ అంతగా ఆడలేదు దీంతో మరింత ఇంట్రెస్టింగ్ సినిమాలతో మీ ముందుకు వస్తానని తెలిపాడు.
ప్రస్తుతం తన వద్ద ఓ లవ్ స్టోరీ, ఓ యాక్షన్ కథ ఉన్నట్లు చెప్పిన ఆకాష్... అవి ఫైనలైజ్ చేయలేదని చెప్పాడు. త్వరలో ఆ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని తెలిపాడు. తనకు సొంతంగా పేరు వచ్చేదాకా మళ్ళీ నాన్న డైరెక్షన్ లో నటించనని ఫిక్స్ అయ్యానని చెప్పుకువచ్చాడు. తాను సీక్వెల్స్ చేయను కానీ అవకాశం వస్తే నాన్న గారి నేనింతే సినిమాకు సీక్వెల్ చేస్తానని వివరించాడు ఆకాష్ పూరి. ప్రస్తుతం ఆకాష్ పూరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











