Ram Charan: ప్రియమైన సిద్ధు.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా.. ఏందుకంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి.. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈయన అదిరిపోయే సినిమాలతో వస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా ఈయన టిల్లు స్క్రేర్ హీరో సిద్ధు జొన్నలగడ్డపై షాకింగ్ కామెంట్లు చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రియమైన సిద్ధు.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎందుకో కూడా వివరించారు. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రీసెంట్ గా వచ్చిన సినిమానే టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకు వెళ్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్ ఆడి పాడింది.

Global Star Ram Charan Congrats to Tillu Sqaure Movie Team Check Details

అలాగే ఐరేని మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రలో కనిపించగా.. నేహా శెట్టిలు అతిథి పాత్రలో దర్శనం ఇచ్చింది. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు.. రామ్ మిరియాల, శఅరీ చరణ్ పాకాల, అచ్చు రాజమణిలు సంగీతం అందించారు. మార్చి 29వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తున్న ఈ సినిమాపై తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

ఈ సినిమా సక్సెస్ పై సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ స్పందించారు. డియర్ సిద్ధు.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. టిల్లు స్క్వేర్ సినిమా అద్భుత విజయం చాలా సంతోషాన్ని ఇస్తుందని వివరించారు. అలాగే ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన హీరోయిన్ అనుపమ, సంగీత దర్శకుడు మల్లిక్ రామ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు టీమ్ మొత్తానికి తన హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఎవరు, ఏ సినిమాతో వస్తున్నారంటే?

గ్లోబల్ స్టార్ సిద్ధు జొన్నలగొడ్డ సినిమాపై స్పందించగా.. అంతా మెచ్చుకుంటున్నారు. మీలాంటి వాళ్లు ఇలాంటి సినిమాలకు రీవ్యూలు ఇస్తే.. చాలా మంది సినిమాలు చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సూపర్ హిట్ దిశగా వెళ్తున్న ఈ సినిమాను అంతా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తే బాగుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. ఇప్పటి వరకు మీరు ఈ చిత్రాన్ని చూసి ఉండకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X