Nani: గుండె బరువెక్కిందంటూ నాని ఎమోషనల్.. కారణం ఏంటంటే?
నాచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ్పరియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు అంతకు మించిన నటించగల సత్తా కల్గిన ఈయన తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ముఖ్యంగా గతంలో హీరోగా చేసిన జెర్సీ సినిమా తాజాగా రీరిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత నాని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే పోస్ట్ చేశారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జెర్సీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన స్పోర్ట్ డ్రామా మూవీయే జెర్సీ. సూర్యదేవర నాగ వంశీ ప్రొడక్షన్ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ క్రింద నిర్మించిన ఈ సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. వీరితో పాటుగా హరీష్ కల్యాణ్, సానుషా, సత్యరాజ్, సంపత్ రాజ్, విశ్వంత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు సను వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అలాగే అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమాను 2019 ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ముఖ్యంగా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదల అయి ఈ సంవత్సరంలో ఐదేళ్లు కాగా.. హైదరాబాద్ లో స్పెషల్ షో వేశారు. అయితే ఈ సినిమాను మరోసారి థియేటర్లలో చూసేందుకు నాని కూడా థియేటర్ కు వచ్చారు. హైదరాబాద్ లోనే సుదర్శన్ థియేటర్ లో సినిమా చూశారు. కేవలం నాని మాత్రమే కాకుండా ఆయన భార్య అంజనా, కొడుకు జున్ను కూడా వచ్చారు.
ఇలా ఫ్యామిలీతో కలిసి చాలా కాలం తర్వాత ఈ సినిమా చూసిన నాని చాలా ఎమోషనల్ అయ్యాడు. బయటకు వచ్చిన వెంటనే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈరోజు తనకు ఎంతో భావోద్వేగం కల్గిందని.. అభిమానుల ఆదరణ చూస్తుంటే.. మళ్లీ తన ప్రయాణాన్ని ఆస్వాదించడం కోసం అర్జున్ తిరిగి భూమ్మీదకు వచ్చినట్లు అనిపించిందని చెప్పుకొచ్చారు. అలాగే గుండె బరువెక్కిందని.. అభిమానుల ప్రేమాభిమానాలతో మననసు నిండిపోయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Srinidhi Shetty: చీరలో శ్రీనిధి శెట్టి సూపర్ క్యూట్ ఫోజులు.. గులాబీలాగే మెరుస్తోందిగా!
కేవలం నాని మాత్రమే కాకుండా ఆయన భార్య అంజనా కూడా ఓ పోస్ట్ పెట్టింది. తొలిసారి థియేటర్ లో సినిమా చూసిన రోజులు తననకు ఇంకా గుర్తున్నాయని.. ఎన్ని సార్లు చూసిన ఆ సీన్లు తనను భావోద్వేగానికి గురి చేస్తాయని చెప్పుకొచ్చింది. అలాగే తన కొడుకు ఇప్పుడిప్పుడే జెర్సీ థీమ్ సాంగ్ ను వాయించడం నేర్చుకుంటున్నాడని వివరించింది. అర్జున్ తన హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశాడని తెలిపింది. అలాగే ఇప్పటి వరకు తాను కలవలేకపోయినా, ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుథ్ కు థాంక్స్ చెబుతున్నట్లు కూడా పోస్టులో రాసుకొచ్చింది.


Click it and Unblock the Notifications











