Prabhas: 'తనలో ఏదో మ్యాజిక్ ఉంది.. అది చూసి ప్రేమలో పడిపోయా': సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్ గురించి, ఆయనకున్న క్రేజ్​, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వరుసగా బడా ప్రాజెక్ట్​లు చేస్తూ ఇండియా వైడ్​గా నెం.1 స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. రీసెంట్​గా సలార్​ చిత్రంతో బాక్సాఫీస్ ముందు భారీ హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్స్ కోసం సిద్ధం అవుతున్నారు. అయితే ఆయన తనతో ప్రేమలో పడినట్లు, తనలో ఏదో మ్యాజిక్ ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఈ స్టోరీ చదివేయండి.

ఫ్యాన్స్​లో గూస్​ బంప్స్: ప్రభాస్​.. ఈ ఆరడగుల కటౌట్ చూసిన లేదా కనీసం ఆ పేరు విన్నా ఫ్యాన్స్​లో గూస్​ బంప్స్ వస్తుంటాయి. అంతలా ప్రేక్షకుల మదిలో తన స్థానాన్ని సంపాదించుకున్నారాయన. ఇండస్ట్రీలో ఇప్పటికీ మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆయనే. అందరూ పెళ్లి పీటలెక్కుతున్న ఈయన మాత్రం దాని గురించి అస్సలు పట్టించుకోకుండా కెరీర్​లో ముందుకెళ్తున్నారు.

Hero Prabhas Fall in Love With Puri Jagannadh Movies News Goes Viral

వరుస సినిమాలతో ఫుల్​ బిజీ: రస్తుతం కెరీర్ పరంగా ఆయన వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్​గా మారిన ఎన్నో బడా ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టారు. అయితే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆయన మార్కెట్ మాత్రం అస్సలు డీలా పడలేదు. రీసెంట్​గా సలార్​తో మళ్లీ బాక్సాఫీస్​ను షేక్ చేశారు. వందల కోట్ల వసూళ్లను కొల్లగొట్టారు. అంచనాలకు మించి కలెక్షన్లను అందుకున్నారు.

Hero Prabhas Fall in Love With Puri Jagannadh Movies News Goes Viral

ప్రభాస్ చేతినిండా సినిమాలు: ఈ ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ, కన్నప్ప, రాజాసాబ్ వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ చిత్రాలతో పాటు సలార్2, స్పిరిట్, కల్కి సీక్వెల్ కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఇంకా హను రాఘవపూడితో, లోకేశ్ కనగరాజ్​తో సినిమాలు చర్చలు జరుగుతున్నాయి. అలా చేతినిండా సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు డార్లింగ్.

త్రో బ్యాక్ వీడియో వైరల్: అయితే ఇప్పుడాయన గురించి ఓ త్రో బ్యాక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో డార్లింగ్​ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి కామెంట్స్ చేశారు. పూరి జగన్నాథ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. బుజ్జిగాడు సినిమా సమయంలోనే పూరి జగన్నాథ్ ఆటిట్యూడ్​కు తాను ఫిదా అయిపోయినట్లు గుర్తుచేసుకున్నారు. ఒక హీరోకు పూరి ఇచ్చే క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంటుందని, ఆయన గతంలో తెరకెక్కించిన చిత్రాలు చూసి తనతో ప్రేమలో పడిపోయానని చెప్పుకొచ్చారు. పూరీలో ఏదో మ్యాజిక్ ఉందని కూడా అన్నారు.

Hero Prabhas Fall in Love With Puri Jagannadh Movies News Goes Viral

ప్రభాస్ కామెంట్స్ నెట్టింట్లో చక్కర్లు: ఒకసారి పూర్తితో సినిమా చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని అనిపిస్తుంది అని, అందుకే పూరీ అంటే తనకు ఎంతో ఇష్టమని వివరించారు. ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ కామెంట్సే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పూరి జగన్నాథ్ ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఆయన తెరకెక్కించిన లైగర్ భారీ డిజాస్టర్​ను అందుకుంది. ప్రస్తుతం ఆయన రామ్​ పోతినేనితో కలిసి డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు. ముంబయి బ్యాక్ డ్రాప్​లో ఇది తెరెకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X