ఆర్థిక సమస్యల్లో డబుల్ ఇస్మార్ట్.. హీరో రామ్ చొరవపై ప్రశంసలు.. అసలు విషయం ఏమిటంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిందనే వార్తలు మీడియాలో హైలెట్‌గా మారాయి. అయితే రూమర్ల వెనుక అసలు వాస్తవం ఎంత అనే విషయానికి వస్తే..

డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ నిలిపివేశారు. నిర్మాతలతో రెమ్యునరేషన్ సమస్య రావడమే అందుకు కారణమనే విషయం ఈ రూమర్లలో స్ట్రాంగ్‌గా వినిపించింది. అయితే గాసిప్స్ వార్లను పక్కన పెడితే.. ఈ సినిమా చేయడానికి హీరో రామ్ కేవలం రెమ్యునరేషన్ మొత్తం కాకుండా కేవలం అడ్వాన్సుగా కొంత మొత్తం తీసుకొని షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 90 శాతానికిపైగా షూటింగ్ పూర్తి అయింది. ఇంకా మూడు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

Hero Ram Pothineni addresses Double Ismart financial Issues with Smartly

అయితే ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు రావడానికి రామ్ రెమ్యునరేషన్, ఆర్థిక సమస్యలు కానే కావు. అయితే ఇండస్ట్రీకి ప్రధాన సపోర్టుగా నిలిచిన ఓటీటీ బిజినెస్ వ్యవహారాల్లో ఒడిదుడుకులు రావడం, అలాగే పలువురు హీరోల సినిమాలు ఎదుర్కొంటున్న సమస్య మాదిరిగానే డబుల్ ఇస్మార్ట్‌కు ఎదురైంది. అందుచేత కొన్ని రోజులు షూటింగ్ నిలిపివేశారు అని వారు పేర్కొన్నారు.

ఇలాంటి ఒడిదుడుకుల నేపథ్యంలో హీరో రామ్ సంచలన నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్‌లో షేర్ తీసుకోవడానికి సిద్దపడి సినిమాను పూర్తి చేయాలని డిసైడ్ కావడంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ఓటీటీ బిజినెస్ పరంగా కొంత సమస్యలు ఎదుర్కొంటున్న నిర్మాతలకు అండగా నిలిచారనే విషయం హైలెట్ అవుతున్నది.

Hero Ram Pothineni addresses Double Ismart financial Issues with Smartly

ఈ క్రమంలో తలెత్తిన ఆర్థిక సమస్యలను నుంచి బయటపడేందుకు ఫైనాన్సియర్లతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఈ ఇబ్బందులు తొలిగిన వెంటనే రామ్ షూట్‌లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇవన్నీ తాత్కాలికమైన సమస్యలే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయమనే ధీమాను చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X