అరగంటలో జైల్లో ఉంటారు జాగ్రత్త.. రామ్ సంచలన వ్యాఖ్యలు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీలోని పాటలు, డైలాగ్స్, రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కొన్ని రోజుల పాటు ఇస్మార్ట్ శంకర్ యువతపై ప్రభావం చూపింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పూరీ, ఛార్మీలు ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కగా.. స్టార్‌డమ్ పరంగా రామ్ మరో మెట్టెక్కారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌ను తెరకెక్కించారు పూరి జగన్నాథ్.

ఇస్మార్ట్ శంకర్‌లోని క్యాస్టింగ్‌ని ఇందులో కంటిన్యూ చేయలేదు. హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్‌లకు బదులు కావ్య థాపర్‌ను ఎంపిక చేశారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే సయాజీ షిండే, గెటప్ శ్రీను, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను, ఝాన్సీ, ప్రగతిలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది. డబుల్ ఇస్మార్ట్‌కు ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు.

hero ram pothineni made sensational comments in the presence of mumbai media at double ismart promotion event

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే వైజాగ్‌, హైదరాబాద్‌లో కొన్ని ఈవెంట్స్ నిర్వహించారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ ముంబైలో దిగింది. అక్కడి ఇస్కాన్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన చిత్ర బృందం.. అనంతరం సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, పూరి జగన్నాథ్, ఛార్మీ, సంజయ్ దత్ సతీమణి మాన్యత, కమెడియన్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్‌లో తనది మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ పాత్రలా ఉంటుందన్నారు. సంజయ్ దత్ పాత్రను ఆయన తప్పించి మరొకరు చేయలేరని రామ్ ప్రశంసించారు. యూట్యూబ్ కారణంగానే సౌత్ మూవీస్‌కు నార్త్‌లో మంచి ఆదరణ దక్కుతోందని.. కొన్నేళ్ల క్రితం ఇక్కడి ప్రేక్షకుల కోరిక మేరకు దక్షిణాదిలో విడుదలైన సినిమాలను, కొన్ని నెలల తర్వాత హిందీలోనూ రిలీజ్ చేసేవాళ్లమని రామ్ గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా తెలుగుతో పాటు ఒకేసారి వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నామన్నారు.

hero ram pothineni made sensational comments in the presence of mumbai media at double ismart promotion event

ఇక తను పోషించిన శంకర్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. షూటింగ్‌లో భాగంగా తాము ముంబైలోని పలు ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వారు తనను శంకర్ , శంకర్ అని పిలిచేవారన్నారు. శంకర్ క్యారెక్టర్‌ను తానేమీ ప్రమోట్ చేయడం లేదని, మీరు కనుక శంకర్‌లా ఉండాలని అనుకుంటే మాత్రం అరగంటలో జైల్లో ఉంటారని రామ్ సరదాగా అన్నారు. శంకర్ క్యారెక్టర్ కేవలం స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయడానికే బాగుంటుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X